News June 13, 2024

మాజీ సీఎం భార్య.. అరుణాచల్‌ప్రదేశ్‌‌లో తొలి మహిళా మంత్రి

image

అరుణాచల్‌ప్రదేశ్‌లో పెమా ఖండూ సీఎంగా BJP ప్రభుత్వం కొలువుదీరింది. వరుసగా మూడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన పెమా.. తన కేబినెట్‌లో ఓ మహిళకు స్థానం కల్పించారు. ఆమె హాయులియాంగ్‌ అసెంబ్లీ స్థానంలో గెలిచిన దసాంగ్లు పుల్. దీంతో ఆ రాష్ట్ర చరిత్రలో మంత్రి పదవి పొందిన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. ఈమె దివంగత మాజీ CM కలిఖో పుల్ సతీమణి. 2016 నుంచి హాయులియాంగ్‌‌లో గెలుస్తూ వస్తున్నారు.

Similar News

News November 15, 2025

రైలులో బైక్& కార్ పార్సిల్ చేయాలా?

image

రైలులో తక్కువ ధరకే వస్తువులను <>పార్సిల్<<>> చేయొచ్చు. ‘పార్సిల్ అండ్ లగేజ్ సర్వీస్’ కింద వస్తువులు, కార్లు & బైక్స్‌ను రైలులో పంపొచ్చు. ఏ వస్తువునైనా దృఢమైన పెట్టెల్లో లేదా సంచుల్లో ప్యాక్ చేయాలి. బైక్ పంపిస్తే RC, ఆధార్ జిరాక్స్ ఇవ్వాలి. బరువు & దూరం ఆధారంగా ఛార్జీలు ఉంటాయి. వారిచ్చిన రసీదును స్టేషన్‌లో చూపించి బైక్ కలెక్ట్ చేసుకోవచ్చు. ‘పార్సిల్ ఇన్సూరెన్స్’ తీసుకుంటే నష్టపరిహారం పొందొచ్చు.

News November 15, 2025

BREAKING: అల్పపీడనం.. భారీ వర్షాలు

image

AP: నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరంలో అల్పపీడనం ఏర్పడిందని APSDMA వెల్లడించింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించినట్లు తెలిపింది. ‘దీని ప్రభావంతో తీరం వెంట 35-55Kmph వేగంతో గాలులు వీస్తాయి. సోమవారం నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు, ప్రకాశం, కడప జిల్లాల్లో మోస్తరు వానలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదు’ అని సూచించింది.

News November 15, 2025

గ్యాస్‌లైటింగ్ గురించి తెలుసా?

image

మానసిక వేధింపుల్లో ‘గ్యాస్‌లైటింగ్’ ఒకటి. దీన్ని అనుసరించే వారు ఎవరినైతే ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో వారితో స్నేహం చేస్తూనే వారిని తప్పుదోవ పట్టిస్తుంటారు. ఈ క్రమంలో తమపై తమకు నమ్మకం పోయేలా, తమ నిర్ణయాలపై తమకే అనుమానం వచ్చేలా చేస్తుంటారు. మానసికంగా బలహీనంగా ఉండే వారితో ఇలా ప్రవర్తిస్తుంటారని నిపుణులు చెబుతున్నారు. ఎదుటి వారిని క్రమంగా బలహీనుల్ని చేసి తమ అధీనంలోకి తెచ్చుకోవడమే వీరి లక్ష్యం.