News June 13, 2024
మాజీ సీఎం భార్య.. అరుణాచల్‌ప్రదేశ్‌లో తొలి మహిళా మంత్రి
అరుణాచల్‌ప్రదేశ్‌లో పెమా ఖండూ సీఎంగా BJP ప్రభుత్వం కొలువుదీరింది. వరుసగా మూడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన పెమా.. తన కేబినెట్‌లో ఓ మహిళకు స్థానం కల్పించారు. ఆమె హాయులియాంగ్ అసెంబ్లీ స్థానంలో గెలిచిన దసాంగ్లు పుల్. దీంతో ఆ రాష్ట్ర చరిత్రలో మంత్రి పదవి పొందిన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. ఈమె దివంగత మాజీ CM కలిఖో పుల్ సతీమణి. 2016 నుంచి హాయులియాంగ్‌లో గెలుస్తూ వస్తున్నారు.
Similar News
News September 20, 2024
కొరియా షూటర్‌కు సినిమా అవకాశం
పారిస్ ఒలింపిక్స్‌లో ప్రపంచ రికార్డు సాధించిన కొరియా షూటర్ కిమ్ యెజీ వీడియో అప్పట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తనకొచ్చిన పేరును సద్వినియోగం చేసుకునేందుకు గాను స్వదేశానికి వెళ్లిన తర్వాత ఆమె ఓ టాలెంట్ మేనేజ్‌మెంట్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. దీంతో ‘క్రష్’ అనే పాన్ వరల్డ్ సినిమాలో ఆమెకు పాత్ర దక్కింది. భారత్ నుంచి అనుష్క సేన్ సహా పలు దేశాల నటులు ఈ సినిమాలో నటిస్తుండటం విశేషం.
News September 20, 2024
సీబీఐతో విచారణ చేయించాలి.. CBNకు బండి లేఖ
తిరుమల లడ్డూ వ్యవహారంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ‘తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీతో పాటు, అవినీతి, అన్యమత ప్రచారంపై సమగ్ర విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఉన్నత స్థాయి వ్యక్తుల ప్రమేయాన్ని నిర్ధారించడంతో పాటు, ఇతర రాష్ట్రాల్లోనూ విచారణ కొనసాగించాల్సిన అవసరం ఉన్నందున సీబీఐతో దర్యాప్తు చేయించాలి. తక్షణమే సమగ్ర విచారణకు ఆదేశించాలి’ అని లేఖలో పేర్కొన్నారు.
News September 20, 2024
రాష్ట్ర అతిథులకు జ్ఞాపికలుగా హస్త కళాకృతులు
AP: మన రాష్ట్ర కళాకారులు రూపొందించిన కళాకృతులు, కలంకారీ వస్త్రాలతో రాష్ట్ర అతిథులను సత్కరించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఈ మేరకు గిఫ్ట్ హ్యాంపర్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వీటి కోసం బడ్జెట్ నుంచి 40% తీసుకొని, మిగిలిన 60% తన సొంత డబ్బును పవన్ వినియోగించనున్నారు. లేపాక్షి సంస్థ కళాకృతులను పరిశీలించిన ఆయన తన కూతురు ఆద్యకు కలంకారీ బ్యాగ్, కొయ్యబొమ్మలను కొనిచ్చారు.