News February 16, 2025

మారిషస్ మాజీ ప్రధాని జగన్నాథ్‌ అరెస్ట్

image

మనీ లాండరింగ్ కేసులో మారిషస్ మాజీ PM ప్రవింద్ జగన్నాథ్‌(63)ను ఆ దేశ ఆర్థిక నేరాల కమిషన్ అరెస్ట్ చేసింది. ఆయన నివాసంలో సోదాలు చేసి కీలక డాక్యుమెంట్లు, లగ్జరీ వాచ్‌లు, నగదును స్వాధీనం చేసుకుంది. ప్రవింద్ 2017-24 మధ్య PMగా పనిచేశారు. ఆయన చేసుకున్న కొన్ని ఒప్పందాల్లో స్కామ్స్ జరిగాయని, వాటిపై ఆడిట్ నిర్వహిస్తామని కొత్త ప్రధాని నవీన్ రామ్ అప్పట్లో ప్రకటించారు. అన్నట్లుగానే చర్యలు తీసుకున్నారు.

Similar News

News April 14, 2026

జిల్లాలో శతశాతం స్వీయ గణన నమోదు కావాలి: మన్యం కలెక్టర్

image

పార్వతిపురం మన్యం జిల్లాలో శతశాతం స్వీయ గణన నమోదు అయ్యేలా తగు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయా శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 16 నుంచి 30 వరకు se.census.gov.in అధికారిక వెబ్‌సైట్‌లో స్వీయ నమోదుకు అవకాశం ఉందని, కుటుంబంలో ఒకరు మొబైల్ నంబర్ ద్వారా వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలన్నారు.

News April 14, 2026

హోటల్ బిల్లులు చెల్లించలేక పాక్ అభాసుపాలు

image

US-ఇరాన్ మధ్య శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహించిన పాక్ అందుకు వేదికైన హోటల్‌కు బిల్లులు చెల్లించలేక అభాసుపాలైంది. ఈనెల 10-12 తేదీల్లో ఇస్లామాబాద్‌లోని సెరీనా హోటల్లో 2దేశాల ప్రతినిధులు చర్చలు జరిపారు. అయితే ఆ బిల్లులు ప్రభుత్వం కట్టకపోవడంతో చివరకు ఆ హోటల్ యజమానే దాన్ని భరించాల్సి వచ్చింది. ఈ హోటల్‌లో ప్రెసిడెంట్ సూట్ ధర ఒక రాత్రికి ₹2.21లక్షలు కాగా స్టాండర్డ్ రూమ్స్ ₹14,896/నైట్ ఉన్నట్లు సమాచారం.

News April 14, 2026

వాహనదారులకు అలర్ట్.. రేపటి నుంచి కొత్త రూల్స్

image

NHలపై ఓవర్ లోడ్‌తో వెళ్లే వాహనాలకు కేంద్రం రేపటి నుంచి కొత్త టోల్ రూల్ అమలు చేయనుంది. పరిమితికి మించి వాహనం మోసుకెళ్లే అదనపు బరువును బట్టి ఫైన్ విధించనుంది. ఓవర్ లోడ్ 10%లోపు ఉంటే ఎలాంటి ఫైన్ ఉండదు. 10-40% ఉంటే సాధారణ టోల్ రేటుకు 2 రెట్లు, 40%+ ఉంటే 4 రెట్లు ఎక్కువగా చెల్లించాలి. కేవలం ఫాస్టాగ్ ద్వారా దీనిని వసూలు చేస్తారు. టోల్ ప్లాజా వద్ద బరువును కొలిచే మెషీన్లు లేకపోతే ఫైన్ ఉండదు.