News August 8, 2024
మాజీ ఎమ్మెల్యే కెంబూరి కన్నుమూత

AP: సీనియర్ రాజకీయ నాయకుడు కెంబూరి రామ్మోహన్ రావు(75) ఇవాళ కన్నుమూశారు. అనారోగ్యంతో విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. ఈయన టీడీపీ నుంచి 1985లో చీపురుపల్లి ఎమ్మెల్యేగా, 1989లో బొబ్బిలి ఎంపీగా విజయం సాధించారు. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
Similar News
News March 29, 2025
గురుకులాల్లో ప్రవేశాలు.. దరఖాస్తు గడువు పెంపు

AP: గురుకుల స్కూళ్లలో ఐదో తరగతి ప్రవేశాలతో పాటు 6, 7, 8 తరగతుల్లోని మిగిలిన ఖాళీల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును పొడిగించినట్లు అధికారులు ప్రకటించారు. ఏప్రిల్ 6లోగా https://aprs.apcfss.in/ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ఫస్టియర్ సీట్ల భర్తీకి నిర్వహించే పరీక్షకు కూడా ఏప్రిల్ 6 వరకు అప్లై చేసుకోవచ్చని సూచించారు.
News March 29, 2025
ఏషియన్ ఛాంపియన్షిప్స్: భారత్కు గోల్డ్

జోర్డాన్ రాజధాని అమ్మాన్లో జరుగుతున్న ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్-2025లో భారత్ తొలి గోల్డ్ మెడల్ సాధించింది. మహిళా రెజ్లర్ మనీషా భన్వాలా 62kgs విభాగంలో స్వర్ణ పతకం గెలిచారు. ఫైనల్లో ఉత్తర కొరియా ప్లేయర్ జె కిమ్పై 8-7 తేడాతో విజయం సాధించారు. మరో రెజ్లర్ అంతిమ్ పంఘల్ (53kgs) కాంస్యం గెలిచారు. దీంతో ఇప్పటివరకు భారత్ గెలిచిన మెడల్స్ సంఖ్య 7కు (1 గోల్డ్, 1 సిల్వర్, 5 బ్రాంజ్) చేరింది.
News March 29, 2025
‘రాజీవ్ యువ వికాసం’ పథకానికి భారీగా దరఖాస్తులు

TG: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ‘రాజీవ్ యువ వికాసం’ పథకానికి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. ఇప్పటివరకు 2 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 5వ తేదీతో దరఖాస్తు ప్రక్రియ ముగియనుండగా, ఏప్రిల్ 6 నుంచి 30 వరకు అప్లికేషన్లను పరిశీలించనున్నారు. జూన్ 2న మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేస్తారు.