News September 19, 2024
జనసేనలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే ఉదయభాను

AP: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట వైసీపీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేనలో చేరికకు రంగం సిద్ధమైంది. ఈ నెల 22న ఆయన పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నారు. రేపు కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఉదయభాను మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ప్రభుత్వ విప్‌గా పని చేశారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి సైతం ఈ నెల 22న జనసేనలో చేరే అవకాశం ఉంది.
Similar News
News December 25, 2025
తెగుళ్ల నుంచి పంట సహజ రక్షణకు సూచనలు

ఏటా అదే భూమిలో ఒకే రకం పంటను వేయకుండా.. పెసర, మినప, అలసంద, మొక్కజొన్న, బంతి వంటి పంటలతో పంటమార్పిడి చేయాలి. ఒకే పంట సాగు వల్ల గత పంటను ఆశించిన చీడపీడలు, తిరిగి కొత్తగా నాటిన అదే పంటను ఆశించి నష్టపరుస్తాయి. పంట మార్పిడి వల్ల ఈ ప్రమాదం తప్పుతుంది. విత్తడానికి ముందు సాగు భూమిని బాగా దుక్కి చేసి ఉంచితే సూర్యరశ్మి వల్ల భూమిలో దాగిన శిలీంధ్రాలు, హానికలిగించే పురుగుల ప్యూపాలు నశిస్తాయి.
News December 25, 2025
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇవాళ కూడా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.320 పెరిగి రూ.1,39,250కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.300 ఎగబాకి రూ.1,27,650 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.1,000 పెరిగి రూ.2,45,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News December 25, 2025
క్రెడిట్ వార్.. రాహుల్‌కు కేంద్ర మంత్రి థాంక్స్

బెంగళూరులోని ‘ఫాక్స్‌కాన్’లో 30K మంది కార్మికుల నియామకంపై INC, BJP మధ్య క్రెడిట్ వార్ మొదలైంది. జాబ్ క్రియేషన్‌కు KA ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిందని LoP రాహుల్ ట్వీట్ చేయగా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. ‘మోదీ మేక్ ఇన్ ఇండియా విజయవంతమైందని గుర్తించినందుకు థాంక్స్’ అని రిప్లై ఇచ్చారు. ఇరువురూ ఇలాంటి SM పోస్టులపై కాకుండా దేశంలో మరిన్ని ఉద్యోగాల కల్పనకు కృషిచేయాలని నెటిజన్లు కోరుతున్నారు.


