News January 26, 2025
మాజీ MLC కన్నుమూత.. నేతల సంతాపం

TG: కరీంనగర్ మాజీ MLC, సీనియర్ జర్నలిస్టు ఆర్.సత్యనారాయణ అనారోగ్యంతో సంగారెడ్డిలోని తన నివాసంలో మృతి చెందారు. ఆయన మృతి పట్ల CM రేవంత్, BRS అధినేత KCR, మంత్రి పొన్నం ప్రభాకర్, హరీశ్‌రావు సహా పలువురు నేతలు సంతాపం తెలియజేశారు. 2007లో కరీంనగర్ గ్రాడ్యుయేట్ MLCగా గెలిచిన ఆయన, 2008లో తెలంగాణ ఉద్యమం కోసం ఆ పదవికి రాజీనామా చేశారు. TSPSC సభ్యుడిగానూ వ్యవహరించారు. గతేడాది కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Similar News
News November 28, 2025
NABARDలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<
News November 28, 2025
సీఎం రేవంత్ జిల్లాల పర్యటన

TG: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 1 నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు. డిసెంబర్ 1న మక్తల్, 2న కొత్తగూడెం, 3న హుస్నాబాద్, 4న ఆదిలాబాద్, 5న నర్సంపేట, 6న దేవరకొండలో పర్యటించనున్నారు.
News November 28, 2025
ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు

*నూర్‌బాషా, దూదేకుల సహకార ఫైనాన్స్ కార్పొరేషన్‌కు ఆమోదం
*తిరుపతి ఎస్వీ వర్సిటీలో లైవ్‌స్టాక్ రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు
*ఖరీఫ్ అవసరాలకు మార్క్‌ఫెడ్ ద్వారా రూ.5వేల కోట్ల రుణ ప్రతిపాదనకు ఆమోదం
*పవర్ ప్రాజెక్టుల ఏర్పాటు, పట్టణాభివృద్ధి శాఖలో చట్టసవరణలకు ఆమోదం


