News January 26, 2025
మాజీ MLC కన్నుమూత.. నేతల సంతాపం

TG: కరీంనగర్ మాజీ MLC, సీనియర్ జర్నలిస్టు ఆర్.సత్యనారాయణ అనారోగ్యంతో సంగారెడ్డిలోని తన నివాసంలో మృతి చెందారు. ఆయన మృతి పట్ల CM రేవంత్, BRS అధినేత KCR, మంత్రి పొన్నం ప్రభాకర్, హరీశ్‌రావు సహా పలువురు నేతలు సంతాపం తెలియజేశారు. 2007లో కరీంనగర్ గ్రాడ్యుయేట్ MLCగా గెలిచిన ఆయన, 2008లో తెలంగాణ ఉద్యమం కోసం ఆ పదవికి రాజీనామా చేశారు. TSPSC సభ్యుడిగానూ వ్యవహరించారు. గతేడాది కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Similar News
News February 18, 2025
కుంభమేళా పొడిగింపు..? యూపీ సర్కారు జవాబు ఇదే

భక్తుల రద్దీని, డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని మహా కుంభమేళాను మరో రెండు రోజుల పాటు పొడిగిస్తారంటూ వస్తున్న వార్తలపై యూపీ సర్కారు స్పందించింది. అలాంటి ఆలోచనలేవీ లేవని తేల్చిచెప్పింది. ముందుగా చెప్పినట్లుగానే ఈ నెల 26న మహాశివరాత్రి రోజునే కుంభమేళా ముగుస్తుందని వివరించింది. తాము అధికారికంగా చెబితే తప్ప.. సోషల్ మీడియాలో వచ్చే వదంతుల్ని నమ్మొద్దని సూచించింది.
News February 18, 2025
వచ్చే వారం నుంచే ఎన్టీఆర్-నీల్ సినిమా షూట్?

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 31వ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘డ్రాగన్’ అన్న వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కే ఈ సినిమా షూటింగ్ వచ్చే వారం నుంచి ప్రారంభం కానుందని సినీ వర్గాల సమాచారం. వికారాబాద్ అడవుల్లో స్టార్ట్ చేయనున్న ఈ తొలి షెడ్యూల్‌లో ఎన్టీఆర్ పాల్గొనరని భోగట్టా. మూవీ కోసం ఆర్ఎఫ్‌సీలో ఇప్పటికే భారీ సెట్ తయారవుతోంది. ఆ సెట్లో జరిగే సెకండ్ షెడ్యూల్‌కు తారక్ వస్తారని తెలుస్తోంది.
News February 18, 2025
బావ కోసం హెలికాప్టర్ ఏర్పాటు చేసిన బావమరిది!

బావమరిది బతుకగోరతాడని సామెత. బిహార్‌లోని వైశాలి ప్రాంతంలో ఓ బావమరిది తన సోదరి భర్త కోసం ఏకంగా హెలికాప్టర్ ఏర్పాటు చేశాడు. పెళ్లైన తర్వాత తొలిసారిగా అతడి సోదరి భర్తతో పుట్టింటికి వస్తుండటంతో వాళ్లు చాలా గ్రాండ్‌గా రావాలని పట్నా నుంచి వైశాలి వరకూ 30 కిలోమీటర్ల దూరం మేర హెలికాప్టర్‌లో తీసుకొచ్చాడు. ఈ వేడుకను తిలకించేందుకు స్థానికులు వారి ఇంటి వద్ద పెద్ద ఎత్తున గుమిగూడారు.