News March 30, 2024
కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్సీ

TG: ఇటీవల బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. GHMC మేయర్ విజయలక్ష్మి నేడు సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. మరోవైపు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ హస్తం గూటికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News February 8, 2026
చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

<
News February 8, 2026
విద్యార్థులకు అస్వస్థత.. కారకులపై CM సీరియస్

AP: పోలవరం(D) దేవరపల్లి ఆశ్రమ బాలుర హాస్టల్ విద్యార్థులు అస్వస్థతకు గురవ్వడానికి గల కారకులపై CM CBN ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటిలోగా నివేదిక అందజేయాలని ఆదేశించారు. బాధ్యులపై శాఖాపరమైన, అవసరాన్ని బట్టి క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. కాగా నిన్న టిఫిన్ చేశాక 92మంది విద్యార్థులకు కడుపునొప్పి, జ్వరం రావడంతో ఆస్పత్రులకు తరలించామని అధికారులు వివరించారు. ప్రస్తుతం వారి పరిస్థితి కుదుటపడిందన్నారు.
News February 8, 2026
ప్రతి తప్పుకు శిక్ష ఉంటుంది!

గరుడ పురాణం ప్రకారం మనం చేసే ప్రతి కర్మకు ఫలితం ఉంటుంది. పాపపుణ్యాల తీవ్రతను బట్టి నరకంలోని శిక్షలు ఉంటాయి. స్వర్గంలోని లోకాలు మారుతుంటాయి. ఈ లోకాలు భువర్లోకం నుంచి సత్యలోకం వరకు ఉంటాయి. జ్ఞానం, భక్తి, త్యాగాల ద్వారా వైకుంఠం, కైలాసం వంటి ఉన్నత స్థితిని పొందవచ్చు. స్వర్గనరకాలు మనం ఎంచుకున్న మార్గాలేనని, జీవితం పరీక్ష అయితే ‘కర్మ’ తుది తీర్పు అని ఈ పురాణం హెచ్చరిస్తోంది. సత్కర్మలే సద్గతికి ఆధారం.


