News March 9, 2025
టీమ్ ఇండియాపై పాక్ మాజీ ఆటగాడి అక్కసు

టీమ్ ఇండియాపై పాక్ మాజీ ఆటగాడు జునైద్ ఖాన్ తీవ్ర ఆరోపణలు చేశారు. కొన్ని జట్లు నైపుణ్యంతో గెలిస్తే మరికొన్ని జట్లు మాత్రం షెడ్యూలింగ్‌తో గెలుస్తాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో మ్యాచుల కోసం న్యూజిలాండ్ 7150 కి.మీ, దక్షిణాఫ్రికా 3286 కి.మీ ప్రయాణించాయి. భారత్ ప్రయాణించిన దూరం సున్నా’ అని ట్వీట్ చేశారు. అతడి ట్వీట్‌పై భారత ఫ్యాన్స్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
Similar News
News March 26, 2025
బాలీవుడ్‌లో సెటిల్ అవుతారా? శ్రీలీల సమాధానమిదే

తాను బాలీవుడ్‌లో సెటిల్ అవుతానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని హీరోయిన్ శ్రీలీల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. టాలీవుడ్ తనకు ఇల్లు లాంటిదని పేర్కొన్నారు. మెడిసిన్ ఫైనలియర్ చదివేందుకు కొన్ని సినిమాలు వదులుకున్నట్లు వెల్లడించారు. నితిన్‌తో కలిసి ఆమె నటించిన ‘రాబిన్‌హుడ్’ ఎల్లుండి రిలీజ్ రానుంది. కాగా బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల డేటింగ్ చేస్తున్నట్లు ఇటీవల ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
News March 26, 2025
మంత్రివర్గ విస్తరణకు వేళాయే

APR 3న TG క్యాబినెట్ విస్తరణ జరగనుంది. ఇద్దరు రెడ్లు, ఇద్దరు బీసీలు, ఒక ఎస్సీకి ఛాన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇప్పటికే వారికి సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. రెడ్లలో రాజగోపాల్, సుదర్శన్, ఎస్సీల్లో వివేక్ పేరు ఖాయమైనట్లు ప్రచారం జరుగుతోంది. అటు బీసీల్లో మాత్రం 2 పదవులకు ముగ్గురు పోటీ పడుతున్నారు. వాకాటి శ్రీహరి పేరు దాదాపు ఖాయం కాగా మరో స్థానం కోసం ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య రేసులో ఉన్నారు.
News March 26, 2025
రాష్ట్రంలో నేరాలు 17% తగ్గాయి: డీజీపీ

AP: రాష్ట్రంలో నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా కలెక్టర్ల సదస్సులో తెలిపారు. 2024 మార్చి నుంచి 2025 ఫిబ్రవరి వరకు అంతకుముందు ఏడాదితో పోల్చితే నేరాలు 17% తగ్గాయని పేర్కొన్నారు. ‘2023 జూన్-2024 JAN మహిళలపై 18,114 నేరాలు జరిగితే 2024 జూన్-2025 JAN వరకు 16,809 నేరాలు జరిగాయి. గంజాయి సాగును 11,000 ఎకరాల నుంచి 100 ఎకరాలకు తగ్గించగలిగాం’ అని వివరించారు.