News March 2, 2025

టీమ్ ఇండియాకు పాక్ మాజీ ప్లేయర్ సవాల్

image

టీమ్ ఇండియా బాగా ఆడేది నిజమైతే పాకిస్థాన్‌తో 10 టెస్టులు, 10 వన్డేలు, 10 T20లు ఆడాలని ఆ జట్టు మాజీ ప్లేయర్ సక్లైన్ ముస్తాక్ సవాల్ విసిరారు. అప్పుడే ఏది బెస్ట్ టీమ్ అనేది తెలుస్తుందని చెప్పారు. ఇదే జరిగితే ఇండియాకు, ప్రపంచ క్రికెట్‌కు తాము తగిన సమాధానం చెప్పిన వాళ్లమవుతామన్నారు. కాగా భారత్, పాక్ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడంతో గత కొన్నేళ్లుగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు నిర్వహించట్లేదు.

Similar News

News January 25, 2026

JNCASRలో ఉద్యోగాలు

image

జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చ్(<>JNCASR<<>>) 7 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి డిగ్రీ, బీకామ్, బీఈ/బీటెక్, డిప్లొమా, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 5 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ/DV, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.jncasr.ac.in

News January 25, 2026

సూర్యుడి రథం మనకు బోధించే పాఠాలివే..

image

సూర్యుని రథానికి ఒకే చక్రం ఉంటుంది. అది ఏడాది కాలానికి సంకేతం. ఆ చక్రానికి ఉన్న 6 ఆకులు 6 రుతువులను సూచిస్తాయి. రథానికి కట్టిన 7 గుర్రాలు సూర్యకాంతిలోని 7 రంగులను(VIBGYOR) సూచిస్తాయి. అలాగే మన శరీరమే ఒక రథంగా చెప్పవచ్చు. బుద్ధిని సారథిగా భావించవచ్చు. మనస్సును పగ్గాలుగా పరిగణించవచ్చు. ఈ రథాన్ని నడిపించే ఆత్మ స్వరూపం సూర్యుడు. నిరంతరం ముందుకు సాగడమే సూర్యుని గుణం. అది మన జీవన ప్రయాణానికి స్పూర్తి.

News January 25, 2026

4G బుల్లెట్ సూపర్ నేపియర్ పశుగ్రాసం ప్రత్యేకత

image

4G బుల్లెట్ సూపర్ నేపియర్ పశుగ్రాసాన్ని అన్ని రకాల నేలల్లో కొద్ది నీటి వసతితో పెంచవచ్చు. ఇది ఏడాదికి 6-7 సార్లు కోతకు వస్తుంది. దీనిలో తీపిదనం ఎక్కువగా ఉండటం వల్ల పశువులు ఇష్టంగా తింటాయి. ఎకరం గడ్డి 10 ఆవులకు సరిపోతుంది. దీనిలో ప్రొటీన్ కంటెంట్ 16-18 శాతంగా ఉంటుంది. ఫైబర్ కూడా ఎక్కువ. దీని వల్ల పశువుల్లో పాల ఉత్పత్తి మరింత పెరుగుతుంది. దీని ఆకులు మృదువుగా ఉండటం వల్ల రైతులు కోయడం కూడా సులభం.