News February 22, 2025
RBI మాజీ గవర్నర్ శక్తికాంత దాస్‌కు కీలక పదవి

RBI మాజీ గవర్నర్ శక్తికాంత దాస్‌కు మరో కీలక పదవి దక్కింది. కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ ఆయన్ను PM మోదీ రెండో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎంపిక చేసింది. అతి త్వరలోనే ఆయన బాధ్యతలు చేపడతారు. RBI గవర్నర్‌గా ఆరేళ్లు పనిచేసిన దాస్‌కు ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్‌లో విశేష అనుభవం ఉంది. ఎకనామిక్స్, ఫైనాన్స్, మినరల్స్, రెవెన్యూ శాఖలు, జీ20 షెర్ఫా, ADB బ్యాంకు, ప్రపంచ బ్యాంకు వ్యవహారాలపై బాగా పట్టుంది.
Similar News
News March 19, 2025
ఏప్రిల్ 1 నుంచి టీడీఎస్ కొత్త రూల్స్

ఏప్రిల్ 1 నుంచి TDS(మూలం వద్ద పన్నుకోత) కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. సీనియర్ సిటిజన్ల FD, RDపై వార్షిక ఆదాయం రూ.లక్ష వరకు ఉంటే TDS వర్తించదు. ప్రస్తుతం రూ.50వేల వరకే ఉంది. అలాగే సాధారణ ప్రజల వడ్డీ ఆదాయం రూ.50వేలు మించకుండా ఉంటే దానిపై బ్యాంకులు TDS కట్ చేయవు. బీమా ఏజెంట్లు, స్టాక్ బ్రోకర్లకు వార్షిక కమిషన్ ఆదాయం రూ.15,000 మించితే TDS వర్తించేది. ఇప్పుడు ఆ పరిమితిని రూ.20,000కు పెంచారు.
News March 19, 2025
మోహన్‌బాబుకు ‘కన్నప్ప’ టీమ్ విషెస్

మోహన్ బాబు బర్త్ డే సందర్భంగా ‘కన్నప్ప’ టీమ్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది. ఈ చిత్రంలో మహాదేవ శాస్త్రి పాత్రలో నటిస్తున్న ఆయన ఫొటోను కుమారుడు మంచు విష్ణు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇటీవల మూవీ నుంచి విడుదలైన టీజర్, పాటకు మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
News March 19, 2025
మరింత బాధ్యతగా పని చేసేలా జనసేన అడుగులు: పవన్

AP: పిఠాపురం చిత్రాడలో జనసేన 12వ ఆవిర్భావ సభ విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఆ పార్టీ అధినేత, Dy.CM పవన్ ధన్యవాదాలు తెలిపారు. ‘రానున్న రోజుల్లో ఇంకా బలమైన పార్టీగా జనసేన మారుతుంది. సామాన్యుల గొంతుకగా, రాష్ట్ర ప్రయోజనాలు, జాతీయ ఐక్యత లక్ష్యంగా మరింత బాధ్యతగా పని చేసే దిశగా అడుగులు వేయనుంది. పార్టీ బలోపేతం కోసం జనసేన శ్రేణులు ప్రజల పక్షాన నిలబడి పని చేయాలి’ అని పవన్ ట్వీట్ చేశారు.