News December 8, 2024
దక్షిణ కొరియా మాజీ రక్షణమంత్రి అరెస్ట్

సౌత్ కొరియా మాజీ రక్షణ మంత్రి కిమ్ యాంగ్-హ్యున్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అధ్యక్షుడు యూన్ సుక్ మార్షల్ లా ప్రకటించడం వెనుక కిమ్ కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలున్నాయి. ఈ నెల 4న ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తాజాగా ఆయన్ను ప్రత్యేక దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుని విచారించింది. కిమ్తో పాటు అధ్యక్షుడు యూన్పైనా దేశద్రోహం కేసు నమోదు చేయాలని ప్రతిపక్షాలు ఇప్పటికే ఫిర్యాదు చేశాయి.
Similar News
News November 25, 2025
ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

ఆంధ్ర యూనివర్సిటీలోని పాపులేషన్ రీసెర్చ్ సెంటర్లో 6 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ASST ప్రొఫెసర్, రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డెమోగ్రఫి, పాపులేషన్ స్టడీస్, స్టాటిస్టిక్స్, బయోస్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, సోషియాలజీ, సోషల్ వర్క్, సైకాలజీ, ఆంత్రోపాలజీలో మాస్టర్ డిగ్రీ, M.Phil, PhDతో పాటు SET/SLET/NET అర్హత సాధించి ఉండాలి. వెబ్సైట్: andhrauniversity.edu.in/
News November 25, 2025
కుర్రాళ్ల ఓపికకు ‘టెస్ట్’!

సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్లో మన కుర్రాళ్లు తేలిపోతున్నారు. ఒకప్పుడు సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్ రోజుల తరబడి క్రీజులో నిలబడేవారు. బౌలర్ల సహనాన్ని పరీక్షించేవారు. కానీ ఇప్పుడున్న ప్లేయర్లు పరుగులు చేయడం అటుంచితే కనీసం గంట సేపైనా ఓపికతో మైదానంలో ఉండలేకపోతున్నారు. కోహ్లీ, రోహిత్, పుజారా, రహానేల తర్వాత టెస్టుల్లోకి వచ్చిన పంత్, నితీశ్, సుదర్శన్, జురెల్ దారుణంగా విఫలమవుతున్నారు.
News November 25, 2025
భార్య గర్భంతో ఉంటే.. భర్త ఇవి చేయకూడదట

భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త కొన్ని పనులు చేయకపోవడం ఉత్తమమని పండితులు చెబుతున్నారు. ‘చెట్లు నరకడం, సముద్ర స్నానం చేయడం శ్రేయస్కరం కాదు. అలాగే క్షౌరం కూడా చేయించుకోకూడదు. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు చావు ఇంటికి వెళ్లడం మంచిది కాదు. శవాన్ని మోయడం అశుభంగా భావిస్తారు. గృహ ప్రవేశం, వాస్తు కర్మలు వంటివి కూడా చేయకూడదు. ఈ నియమాలు పాటిస్తే దీర్ఘాయువు గల బిడ్డ జన్మిస్తుంది’ అని సూచిస్తున్నారు.


