News December 8, 2024
దక్షిణ కొరియా మాజీ రక్షణమంత్రి అరెస్ట్
సౌత్ కొరియా మాజీ రక్షణ మంత్రి కిమ్ యాంగ్-హ్యున్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అధ్యక్షుడు యూన్ సుక్ మార్షల్ లా ప్రకటించడం వెనుక కిమ్ కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలున్నాయి. ఈ నెల 4న ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తాజాగా ఆయన్ను ప్రత్యేక దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుని విచారించింది. కిమ్‌తో పాటు అధ్యక్షుడు యూన్‌పైనా దేశద్రోహం కేసు నమోదు చేయాలని ప్రతిపక్షాలు ఇప్పటికే ఫిర్యాదు చేశాయి.
Similar News
News January 24, 2025
రీ సర్వేపై సందేహాలా? ఈ నంబర్‌కు ఫోన్ చేయండి
APలో భూముల రీసర్వే పైలట్ ప్రాజెక్టు అమలవుతున్న నేపథ్యంలో రైతుల సందేహాల నివృత్తికై ప్రభుత్వం హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రారంభించింది. ఉ.10 నుంచి సా.5.30 వరకు 8143679222 నంబర్‌కు ఫోన్ చేసి సందేహాలు, సమస్యలు తెలియజేయవచ్చని సూచించింది. రీసర్వే సందర్భంగా యజమానులు భూమి వద్దకు వచ్చి హద్దులు చూపించేందుకు 3సార్లు అవకాశం ఉంటుందని, అయినా రాకపోతే వీడియో కాల్ ద్వారా హద్దులు ఖరారు చేస్తామని అధికారులు తెలిపారు.
News January 24, 2025
ముగిసిన TG CM రేవంత్ దావోస్ పర్యటన
దావోస్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ముగిసింది. అక్కడ జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సు-2025లో పాల్గొన్న ఆయన ఈ ఉదయం 10.30 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులే లక్ష్యంగా రేవంత్ బృందం దావోస్ పర్యటన సాగింది. ఈ సందర్భంగా సీఎంకు స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ శ్రేణులు విమానాశ్రయానికి వెళ్లనున్నాయి.
News January 24, 2025
గ్రామాలకు మహర్దశ.. రోడ్ల నిర్మాణానికి రూ.2,773 కోట్లు మంజూరు
TG: ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు ఉండాలన్న CM రేవంత్ రెడ్డి <<15058155>>ఆదేశాల<<>> నేపథ్యంలో ప్రభుత్వం రూ.2,773కోట్లు మంజూరు చేసింది. గ్రామీణ రోడ్ల నిర్మాణానికి రూ.1,419కోట్లు, మరమ్మతులకు రూ.1,288కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం అమలు చేసే ‘పీఎం జన్‌మన్’ పథకానికి రాష్ట్ర వాటాగా రూ.66కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొంది. గ్రామీణ రోడ్ల కోసం ప్రభుత్వం ఇప్పటికే తొలిదశలో రూ.2,682కోట్లు విడుదల చేసింది.