News March 30, 2024

రాజకీయాలకు TDP మాజీ మంత్రి వీడ్కోలు

image

AP: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణ రాజకీయాలకు వీడ్కోలు పలికారు. విశాఖపట్నం జిల్లా పరవాడ మండలం వెన్నెల పాలెంలో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ ప్రకటన చేశారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదన్న ఆయన, రాజకీయంగా తనకు ఇదే చివరి సమావేశం అన్నారు. సాటి కార్యకర్తలకు అండగా నిలబడతానన్నారు.

Similar News

News January 21, 2025

టెక్నాలజీ వినియోగంలో ఏపీ నంబర్‌వన్: నారా లోకేశ్

image

AP: టెక్ వినియోగంలో ఏపీ నంబర్‌వన్ స్థానంలో ఉందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. AIలోనే కాకుండా డీప్ టెక్‌లోనూ తాము ముందున్నామని దావోస్‌లో చెప్పారు. మరోవైపు ఇదే సదస్సులో CM చంద్రబాబు పలు కంపెనీల సీఈఓలతో భేటీ అయ్యారు. ఎల్జీ కెమ్, సిస్కో, కార్ల్స్ బెర్గ్, మార్క్స్ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు CM ట్వీట్ చేశారు. ఈ కంపెనీలన్నింటికి ఆహ్వానం పలుకుతున్నట్లు పేర్కొన్నారు.

News January 21, 2025

‘సంక్రాంతికి వస్తున్నాం’.. ALL TIME RECORD

image

విక్టరీ వెంకటేశ్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఇండస్ట్రీ రికార్డులను కొల్లగొడుతోంది. విడుదలైన తొలి వారం రోజుల్లోనే రూ.203 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ప్రాంతీయ సినిమాల్లో ఇదే ఆల్ టైమ్ రికార్డు అని పేర్కొంది. కాగా వెంకటేశ్ ఇప్పటివరకు నటించిన సినిమాల్లో అత్యధిక గ్రాస్ కలెక్షన్లు వచ్చిన చిత్రం ఇదే. జనవరి 14న రిలీజైన ఈ మూవీ ఫ్యామిలీ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది.

News January 21, 2025

పెంగ్విన్‌ల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు

image

అంటార్కిటిక్ తీరాలు, ద్వీపాలలో కనిపించే పెంగ్విన్ పక్షులు ఎగరలేకపోయినా వేగంగా ఈదగలవు. వీటిని స్విమ్మింగ్‌లో రేసు గుర్రాలంటుంటారు. పెంగ్విన్ రెక్కలు ఫ్లిప్పర్లుగా ఉండటంతో ఇవి గంటకు 35kmph వేగంలో స్విమ్ చేస్తుంటాయి. వీటి రెక్కల కిందనున్న కొవ్వు ఉష్ణోగ్రతలను నియంత్రించడానికి పనిచేస్తాయి. అందుకే చల్లటి వాతావరణంలోనూ వెచ్చగా ఉంటాయి. పెంగ్విన్‌లు తన మేట్‌ను కలిసేందుకు ప్రత్యేక శబ్ధాలు చేస్తుంటాయి.