News August 14, 2024
కెన్యా కోచ్‌గా టీమ్ఇండియా మాజీ క్రికెటర్
టీమ్ఇండియా మాజీ క్రికెటర్ దొడ్డ గణేశ్ కెన్యా జట్టుకు కోచ్‌గా ఎంపికయ్యారు. త్వరలోనే బాధ్యతలు స్వీకరిస్తారు. భారత్ తరఫున ఆయన 4 టెస్టులు, ఒక వన్డే ఆడారు. 2000 రన్స్, 365 వికెట్లతో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో సక్సెస్ అయ్యారు. కెన్యా కోచ్‌గా ఎంపికైనందుకు హ్యాపీగా ఉందని ఆయన ట్వీట్ చేశారు. భారతీయులను కోచ్‌గా పెట్టుకోవడం కెన్యాకు కొత్తేం కాదు. సందీప్ పాటిల్ కోచింగులో 2003 ODI వరల్డ్ కప్ సెమీస్‌కు చేరింది.
Similar News
News September 19, 2024
సీబీఐ విచారణ వేయండి: అంబటి రాంబాబు
AP: తిరుమల లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు దుర్మార్గపు ఆరోపణ చేయడం సరికాదని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. దమ్ముంటే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ‘రాజకీయ లబ్ధి కోసం మరీ ఇంత నీచానికి దిగజారుతావా చంద్రబాబు’ అని వైసీపీ ట్వీట్ చేసింది. కాగా, నెయ్యికి బదులు జంతువుల కొవ్వుతో లడ్డూలు తయారుచేశారని చంద్రబాబు నిన్న వ్యాఖ్యానించారు.
News September 19, 2024
పోలీసుల అదుపులో జానీ మాస్టర్
అసిస్టెంట్ డాన్సర్‌పై అత్యాచారం కేసులో పరారీలో ఉన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పోలీసులకు చిక్కారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ ఎస్‌వోటీ పోలీసులు అతడిని బెంగళూరు విమానాశ్రయం సమీపంలో అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. నేరుగా ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. మరోవైపు మహిళా కమిషన్ ఆదేశాలతో బాధితురాలికి భద్రతను పెంచారు.
News September 19, 2024
మోదీనే నం.1
ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఇంట్రెస్టింగ్ ట్వీట్స్ చేస్తుంటారు. దీంతో ఆయన గురించి తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తిచూపుతారు. ఈ ఏడాది Xలో జనవరి – ఆగస్టు వరకు అత్యధిక మంది మాట్లాడుకున్న వ్యక్తిగా మోదీ నిలిచారు. ఆయన తర్వాత విరాట్ కోహ్లీ(2), రోహిత్ (3), విజయ్ (4), యోగీ ఆధిత్యనాథ్ (5), రాహుల్ గాంధీ (6), ధోనీ (7), షారుఖ్ ఖాన్(8), పవన్ కళ్యాణ్ (9), ఎన్టీఆర్ (10) ఉన్నారు.