News August 11, 2024
కేంద్ర మాజీ మంత్రి నట్వర్ సింగ్ కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి నట్వర్ సింగ్ (93) కన్నుమూశారు. కొద్దిరోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఢిల్లీలోని మేదాంత ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. కాగా నట్వర్ 1931లో రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో జన్మించారు. 2004-05 మధ్య యూపీఏ హయాంలో విదేశాంగ మంత్రిగా సేవలందించారు. ఆయన పలు పుస్తకాలు కూడా రచించారు. 1984లో కేంద్రం నట్వర్‌ను పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది.
Similar News
News December 12, 2025
దోనేపూడి ప్రమాదం.. మృతులు వీరే!

కొల్లూరు మండలం <<18543680>>దోనేపూడి <<>>గ్రామ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భట్టిప్రోలు వాసులు మృతి చెందారు. భట్టిప్రోలు మండలం చింతమోటు గ్రామానికి చెందిన చత్రగడ్డ కాంతారావు, పెసరలంక శ్రీనివాసరావు వెల్లలూరు గ్రామానికి చెందిన షేక్ ఇస్మాయిల్ అనే ముగ్గురు మృతి చెందారని అధికారులు ధ్రువీకరించారు. అదేవిధంగా సమ్మెట పోతురాజు, సమ్మెట గణేష్ అనే ఇరువురు గాయపడి తెనాలి వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు.
News December 12, 2025
ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నెల 18, 19 తేదీల్లో ఢిల్లీ పెద్దలతో భేటీకానున్నారు. 18న సాయంత్రం విజయవాడ నుంచి బయల్దేరి ఢిల్లీ చేరుకోనున్నారు. అదేరోజు రాత్రి పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశముంది. పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర నిధులు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ఆమోదాలు, అనుమతులపై చర్చించే అవకాశం ఉంది. 19న సాయంత్రం తిరిగి విజయవాడ బయల్దేరనున్నారు.
News December 12, 2025
రెండో విడత ప్రచారానికి తెర

TGలో రెండో విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో ప్రచారం ముగిసింది. ఎల్లుండి పోలింగ్ జరగనుంది. రెండో విడతలో 4,333 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. 12 వేలకుపైగా నామినేషన్లు దాఖలయ్యాయి. పోలింగ్‌కు అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఫలితాలు వెల్లడిస్తారు.


