News August 28, 2024

మాజీ వరల్డ్ నం.1 బ్యాటర్ రిటైర్మెంట్

image

ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ డేవిడ్ మలన్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. మలన్ గతంలో ఐసీసీ T20 ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానంలోనూ నిలిచారు. 37ఏళ్ల మలన్ ఇంగ్లండ్ తరఫున 22 టెస్టులు, 30 వన్డేలు, 62 టీ20లు ఆడారు. మూడు ఫార్మాట్లలోనూ సెంచరీ చేసిన బ్యాటర్‌గా నిలిచారు. గత వన్డే వరల్డ్ కప్ నుంచి ఇంగ్లండ్ జట్టులో చోటు దక్కకపోవడంతో తాజాగా వీడ్కోలు పలికారు.

Similar News

News April 8, 2026

ఇది యుద్ధానికి ముగింపు కాదు: మొజ్తబా ఖమేనీ

image

సీజ్‌ఫైర్‌కు <<19594824>>అంగీకరించిన<<>> నేపథ్యంలో కాల్పులు ఆపాలని మిలిటరీ యూనిట్లకు ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ ఆదేశాలిచ్చారు. అయితే ఇది యుద్ధానికి ముగింపు కాదని స్పష్టంచేశారు. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా ఇదే విషయం స్పష్టం చేసింది. ‘సీజ్‌ఫైర్ అగ్రిమెంట్ చేసుకున్నామంటే దానర్థం యుద్ధం ముగిసినట్లు కాదు. మా చేతులు ట్రిగ్గర్‌పైనే ఉంటాయి. చిన్న తప్పు చేసినా విరుచుకుపడతాం’ అని హెచ్చరించింది.

News April 8, 2026

EAPCET అభ్యర్థులకు అలర్ట్.. ఎడిట్ ఆప్షన్‌కు నేడే లాస్ట్ డేట్!

image

TG: ఇంజినీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల కోసం రాసే EAPCET అప్లికేషన్లలో తప్పులుంటే సరిచేసుకోవడానికి ఇచ్చిన టైమ్ ఇవాళ్టితో ముగియనుంది. చాలా మంది అప్లికేషన్లలో తప్పులు రావడంతో అధికారులు ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. పేరు, పుట్టిన తేదీ, ఇంటర్ హాల్‌టికెట్ నంబర్ వంటివి ఆన్‌లైన్‌లో మారవు. అందుకే వీటి కోసం స్టూడెంట్స్ హైదరాబాద్‌లోని JNTUకి క్యూ కడుతున్నారు. మిగతా వివరాలను మాత్రం ఆన్‌లైన్‌లోనే వెంటనే మార్చుకోవచ్చు.

News April 8, 2026

ముంచుకొస్తున్న కరవు.. 2027 వరకు గడ్డుకాలమే!

image

పసిఫిక్ సముద్రం వేడెక్కుతోంది. రాబోయేది మామూలు ఎల్ నినో కాదు. ఏకంగా ‘సూపర్ ఎల్ నినో’ అని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల 2027 వరకు ప్రపంచవ్యాప్తంగా ఎండలు మండిపోతాయి. ఇండియాలో వర్షాలు కురవక సాగు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. దక్షిణ అమెరికాలో భారీ వరదలు, ఆసియాలో కరవు వచ్చే అవకాశం కనిపిస్తోంది. వాతావరణం అల్లకల్లోలంగా మారనుంది. దీనికి ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.