News August 28, 2024
మాజీ వరల్డ్ నం.1 బ్యాటర్ రిటైర్మెంట్

ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ డేవిడ్ మలన్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. మలన్ గతంలో ఐసీసీ T20 ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానంలోనూ నిలిచారు. 37ఏళ్ల మలన్ ఇంగ్లండ్ తరఫున 22 టెస్టులు, 30 వన్డేలు, 62 టీ20లు ఆడారు. మూడు ఫార్మాట్లలోనూ సెంచరీ చేసిన బ్యాటర్‌గా నిలిచారు. గత వన్డే వరల్డ్ కప్ నుంచి ఇంగ్లండ్ జట్టులో చోటు దక్కకపోవడంతో తాజాగా వీడ్కోలు పలికారు.
Similar News
News February 10, 2026
భారత్‌తో మ్యాచ్ ఆడండి.. పాక్‌కు బంగ్లా రిక్వెస్ట్

పాకిస్థాన్ నిజమైన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించిందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ ప్రెసిడెంట్ అమినుల్ ఇస్లాం ప్రశంసల వర్షం కురిపించారు. ‘మాకు మద్దతుగా పాకిస్థాన్ నిలబడిన తీరుకు రుణపడి ఉంటాం. నేను నిన్న PCB ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీతో భేటీ అయ్యాను. వారి సపోర్ట్‌కు కృతజ్ఞతలు తెలిపాను. క్రికెట్ మేలు కోసం ఈ నెల 15న భారత్‌తో మ్యాచ్ ఆడాలని వారికి విజ్ఞప్తి చేశాను’ అని వ్యాఖ్యానించారు.
News February 9, 2026
చంద్రయాన్-4 ల్యాండింగ్ సైట్ ఫిక్స్

చంద్రయాన్-3 విజయం తర్వాత ఇస్రో మరో చారిత్రక అడుగుకు సిద్ధమైంది. చంద్రుడి మట్టిని భూమికి తీసుకొచ్చే ‘చంద్రయాన్-4’ మిషన్‌కు కీలకమైన ల్యాండింగ్ సైట్‌ను ఖరారు చేసింది. ఈసారి కూడా చంద్రుడి సౌత్ పోల్ ప్రాంతానికే ఇస్రో ప్రాధాన్యం ఇచ్చింది. ఇది ‘లూనార్ శాంపిల్ రిటర్న్’ మిషన్ కావడంతో ల్యాండింగ్, మట్టి సేకరణ, తిరిగి రావడం వంటి క్లిష్ట దశలు ఉన్నాయి. 2028 నాటికి ఈ మిషన్‌ను ప్రయోగించనున్నారు.
News February 9, 2026
వివాదాస్పద బుక్.. లీకేజీపై దర్యాప్తు

లోక్‌సభలో <<19052501>>ప్రకంపనలు<<>> రేపిన ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ నరవణె ఆత్మకథ పుస్తకం ఎలా లీకైందనేదానిపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. FIR నమోదు చేసి PDF కాపీ ఎలా బయటికి వచ్చిందని ఆరా తీస్తున్నారు. చైనాతో ఉద్రిక్తతలకు సంబంధించి నిజాలు ఇందులో రాశారని రాహుల్ గాంధీ అంటున్నారు. ఈ పుస్తకం ఎప్పటికీ పబ్లిష్ కాదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ చెబుతున్నారు. కేంద్ర ఆమోదం లభించకపోవడంతో ఈ పుస్తకం పబ్లిషింగ్ నిలిచిపోయింది.


