News June 5, 2024

ఒకే నియోజకవర్గం నుంచి నలుగురు MLAలు!

image

AP: ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గానికి చెందిన నలుగురు MLAలుగా ఎన్నికయ్యారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. దామచర్ల జనార్దన్ (ఒంగోలు), డీబీవీ స్వామి (కొండపి), ఎంఎం కొండయ్య (చీరాల), గంటా శ్రీనివాస్ (భీమిలి) ఈ నియోజకవర్గానికి చెందినవారే. అలాగే ఒంగోలులో ఓడిన YCP అభ్యర్థి బాలినేని శ్రీనివాస్ రెడ్ది, కందుకూరులో ఓడిన YCP అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ కూడా ఇదే సెగ్మెంట్‌కు చెందినవారు.

Similar News

News December 23, 2025

గూగుల్ టెకీలకు గుడ్‌న్యూస్.. గ్రీన్‌కార్డ్ ప్రాసెస్ మళ్లీ షురూ!

image

H-1B వీసాతో గూగుల్‌లో పనిచేసే వారికి గ్రీన్ కార్డ్ ప్రక్రియను 2026 నుంచి మళ్లీ భారీ స్థాయిలో మొదలుపెట్టాలని కంపెనీ నిర్ణయించింది. ఆఫీసు నుంచి పనిచేస్తూ, మంచి పర్ఫార్మెన్స్ రేటింగ్ ఉన్న సీనియర్లకు ఇందులో ప్రాధాన్యం ఉంటుంది. ఈ అవకాశం కోసం రిమోట్ వర్కర్లు ఆఫీసు లొకేషన్‌కు మారాలి. లేఆఫ్స్ వల్ల రెండేళ్లుగా ఆగిన ఈ ప్రాసెస్ మళ్లీ స్టార్ట్ కానుండటంతో వేలాదిమంది ఉద్యోగుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

News December 23, 2025

రైతన్నకు మంచిరోజులు వచ్చేది ఎప్పుడో!

image

ధనిక, పేద తేడా లేకుండా అందరి ఆకలి తీర్చేది రైతు పండించే మెతుకులే. దాని కోసం రైతు పడే కష్టం, మట్టితో చేసే యుద్ధం వెలకట్టలేనిది. తెల్లవారుజామునే నాగలి పట్టి పొలానికి వెళ్లే అన్నదాతే అసలైన హీరో. తన రక్తాన్ని చెమటగా మార్చి పంటకు ప్రాణం పోసే రైతు అప్పుల్లో ఉంటే అది దేశానికే తీరని లోటు. రైతు ఆనందంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. మరి రైతు రాజయ్యేదెప్పుడో! *ఇవాళ జాతీయ <<18647657>>రైతు<<>> దినోత్సవం

News December 23, 2025

నాడు ఊరిలో సఫాయీ.. నేడు ఊరికే సర్పంచ్

image

TG: నిర్మల్ జిల్లా తానూర్ మండలం తొండాలకి చెందిన మిరేకర్ మాధవ్ ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధ్యమేనని నిరూపించారు. 19 ఏళ్ల పాటు గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేశారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో ఎస్సీ రిజర్వేషన్ రావడంతో ఆయన పోటీ చేసి గెలుపొందారు. నిన్న మాధవ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సఫాయీ కార్మికుడిగా ఉన్న తనను సర్పంచ్‌ చేసిన గ్రామస్థులకు ధన్యవాదాలు తెలిపారు.