News June 5, 2024
ఒకే నియోజకవర్గం నుంచి నలుగురు MLAలు!
AP: ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గానికి చెందిన నలుగురు MLAలుగా ఎన్నికయ్యారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. దామచర్ల జనార్దన్ (ఒంగోలు), డీబీవీ స్వామి (కొండపి), ఎంఎం కొండయ్య (చీరాల), గంటా శ్రీనివాస్ (భీమిలి) ఈ నియోజకవర్గానికి చెందినవారే. అలాగే ఒంగోలులో ఓడిన YCP అభ్యర్థి బాలినేని శ్రీనివాస్ రెడ్ది, కందుకూరులో ఓడిన YCP అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ కూడా ఇదే సెగ్మెంట్‌కు చెందినవారు.
Similar News
News December 1, 2024
రేపు చిత్తూరు జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు
AP: ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో రేపు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రకటించారు. సోమవారం కూడా జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో ముందస్తుగా సెలవు ఇచ్చారు. అటు నెల్లూరు, తిరుపతి, YSR జిల్లాల్లోనూ సెలవు ఇవ్వాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
News December 1, 2024
ఈ జ్యూస్‌లను తాగకపోవడమే మంచిది: వైద్యులు
పండ్లు తినే బదులు పండ్ల రసాలు, ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్ తాగితే సరిపోతుంది కదా? అని కొందరు భావిస్తుంటారు. కానీ, ఈ మూడింట్లో ఏది బెటరో వైద్యులు సూచించారు. ‘ప్యాకేజ్డ్ పండ్ల రసాలలో అధిక మొత్తంలో షుగర్ ఉండటం వల్ల వాటిని సేవించొద్దు. తాజా పండ్ల రసాలు తాగడం వల్ల అధిక మొత్తంలో పండ్లు తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడప్పుడు ఆ జ్యూస్ తాగినా, తాజా పండ్లు తినేందుకే మొగ్గుచూపాలి’ అని డాక్టర్లు తెలిపారు.
News December 1, 2024
కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదు: హరీశ్‌రావు
TG: ప్రభుత్వ ఆదాయం పెంచే సత్తా కాంగ్రెస్ పార్టీకి లేదని హరీశ్‌రావు విమర్శించారు. ‘మంచి ఆర్థికవృద్ధితో ఉన్న రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్పగించాం. కానీ ఈ ప్రభుత్వం ఆదాయం పెంచే మార్గాలను అన్వేషించడం లేదు. ప్రభుత్వ అప్పులన్నీ బహిరంగ రహస్యమే. ఏటా కాగ్ ప్రవేశపెట్టే నివేదికల్లో ఇవన్నీ ఉంటాయి. ఎన్నికలకు ముందే రైతుబంధు వేసేందుకు మేం సిద్ధమయ్యాం. కానీ కాంగ్రెస్ అడ్డుకుంది’ అని ఆరోపించారు.