News April 25, 2024
ఇంటర్లో ఫెయిలయ్యామని మరో నలుగురు విద్యార్థుల ఆత్మహత్య

TG: ఇంటర్ ఫలితాల్లో ఫెయిలయ్యామనే మనస్తాపంతో నలుగురు విద్యార్థులు <<13114471>>ఆత్మహత్య<<>> చేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లాలో చిప్ప భార్గవి ఉరివేసుకోగా.. యశస్విని బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. HYD మెహిదీపట్నంలో హర్షిణి, పఠాన్‌చెరుకు చెందిన సాయితేజ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలతో తల్లిదండ్రులకు కడుపుకోత మిగల్చవద్దని పలువురు సూచిస్తున్నారు.
Similar News
News December 19, 2025
నితీశ్ కుమార్‌కు భద్రత పెంపు

ఇటీవల మహిళా డాక్టర్ హిజాబ్ లాగి విమర్శలు ఎదుర్కొంటున్న బిహార్ CM నితీశ్‌కు భద్రత పెంచారు. బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేయాలని నిఘా సంస్థలు సూచించాయని అధికారులు తెలిపారు. నితీశ్‌కు స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్(SSG) కఠినమైన భద్రతావలయాన్ని విధించినట్లు చెప్పారు. పరిమిత సంఖ్యలో ఉన్నతస్థాయి వ్యక్తులనే అనుమతిస్తున్నట్లు తెలిపారు. అటు రాష్ట్రంలోని సున్నితమైన ప్రాంతాల్లోనూ నిఘా పెంచారు.
News December 19, 2025
కోళ్లను పెంచాలనుకుంటున్నారా? ఈ జాతులతో అధిక ఆదాయం

కోళ్ల పెంపకం నేడు ఉపాధి మార్గం. మేలైన జాతి కోళ్లతో మంచి ఆదాయం సాధ్యం. వనరాజ, గిరిరాజ, స్వర్ణధార, గ్రామ ప్రియ, రాజశ్రీ, శ్రీనిధి, కడక్‌నాథ్, వనశ్రీ, గాగస్, ఆసిల్ మేలైన జాతి కోళ్లకు ఉదాహరణ. ఇవి అధిక మాంసోత్పత్తి, వ్యాధి నిరోధక శక్తి కలిగి, అధిక గుడ్ల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందాయి. ఇక BV 380 రకం కోళ్లు ఏడాదిలో 300కి పైగా గుడ్లు పెడతాయి. ఈ కోళ్ల జాతుల పూర్తి సమాచారం కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News December 19, 2025
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో ఉద్యోగాలు

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (<


