News April 25, 2024

ఇంటర్‌లో ఫెయిలయ్యామని మరో నలుగురు విద్యార్థుల ఆత్మహత్య

image

TG: ఇంటర్ ఫలితాల్లో ఫెయిలయ్యామనే మనస్తాపంతో నలుగురు విద్యార్థులు <<13114471>>ఆత్మహత్య<<>> చేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లాలో చిప్ప భార్గవి ఉరివేసుకోగా.. యశస్విని బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. HYD మెహిదీపట్నంలో హర్షిణి, పఠాన్‌చెరు‌కు చెందిన సాయితేజ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలతో తల్లిదండ్రులకు కడుపుకోత మిగల్చవద్దని పలువురు సూచిస్తున్నారు.

Similar News

News September 18, 2024

గ్రామీణ యువకుడికి రూ.2 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం!

image

బిహార్ అనగానే వలసలు, గొడవలే గుర్తొస్తాయి. కానీ, తమలోనూ ఎంతో ప్రతిభ ఉందని జము ఖరియాకు చెందిన కంప్యూటర్ ఇంజినీర్ అభిషేక్ కుమార్ నిరూపించారు. గ్రామీణప్రాంతానికి చెందిన అతను లండన్‌లోని గూగుల్ కంపెనీలో రూ.2 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగాన్ని పొంది ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. NIT పట్నాలో ఇంజినీరింగ్ పూర్తి చేసి 2022లో Amazonలో ₹1.08 కోట్ల వేతనంతో ఉద్యోగం పొందారు. తాజాగా గూగుల్‌లో జాబ్ సాధించారు.

News September 18, 2024

ప్రతి బాల్‌కు ముందు ‘ఓం నమః శివాయ’ జపం చేశా: కోహ్లీ

image

బీసీసీఐ స్పెషల్ ఇంటర్వ్యూలో హెడ్ కోచ్ గంభీర్, విరాట్ కోహ్లీ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. విరాట్ కోహ్లీ పటిష్ఠమైన ఫాస్ట్ బౌలింగ్ విభాగాన్ని నిర్మించారని, 25 ఏళ్ల వయసులోనే పవర్‌ఫుల్ టీమ్‌ను ఏర్పరిచారని గంభీర్ కొనియాడారు. కాగా 2014-15 ఆస్ట్రేలియన్ టూర్‌లో ప్రతి బాల్‌కు ముందు ఓం నమః శివాయ జపం చేసినట్లు కోహ్లీ తెలిపారు. 2009 NZ పర్యటనలో రెండున్నర రోజులు ‘హనుమాన్ చాలీస’ విన్నట్లు గంభీర్ చెప్పారు.

News September 18, 2024

పేజర్లలా మన మొబైళ్లనూ పేల్చేస్తే?

image

<<14129580>>లెబనాన్‌లో పేజర్ల<<>> పేలుళ్లతో నిత్యం మన చేతుల్లో ఉండే మొబైళ్లపై ఆందోళన వ్యక్తం అవుతోంది. సింపుల్ నెట్‌వర్క్, లిథియం బ్యాటరీలుండే డివైజులతోనే ఇంత విధ్వంసం జరిగింది. ఇక GPS ట్రాకర్, గూగుల్ మ్యాప్స్, పవర్‌ఫుల్ లిథియం బ్యాటరీ, 5జీ నెట్‌వర్క్‌తో పనిచేసే సెల్‌ఫోన్లను టెర్రరిస్టులు టార్గెట్ చేస్తే పరిస్థితి ఏంటని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సైబర్ అటాక్స్‌పై భయం రెట్టింపైంది. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి?