News November 4, 2024
విద్యుత్ షాక్‌తో నలుగురి మృతి.. ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం
AP: తూర్పు గోదావరి(D) తాడిపర్రులో విద్యుత్ షాక్‌కు గురై నలుగురు యువకులు <<14523941>>మృతి<<>> చెందడంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఫ్లెక్సీలు కడుతుండగా ఈ దుర్ఘటన జరిగింది.
Similar News
News December 14, 2024
గీతా ఆర్ట్స్ ఆఫీస్‌లోనే బన్నీ
చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ తొలుత జూబ్లీహిల్స్‌లోని గీతా ఆర్ట్స్ ఆఫీస్‌కు వెళ్లారు. ప్రస్తుతం ఆయన అక్కడే ఉన్నారు. బన్నీని కలిసేందుకు నిర్మాత దిల్ రాజు సహా సినీ ప్రముఖులు అక్కడికి చేరుకుంటున్నారు. మరికొద్దిసేపు అర్జున్ ఆఫీస్‌లోనే ఉండనున్నారు. అనంతరం నివాసానికి వెళ్తారు. అక్కడికి అభిమానులు రాకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
News December 14, 2024
IND vs AUS: మళ్లీ వర్షం.. నిలిచిన ఆట
బ్రిస్బేన్ టెస్టును వరుణుడు అడ్డుకుంటున్నాడు. వర్షం వల్ల రెండు సార్లు ఆట నిలిచిపోయింది. తొలిసారి 5వ ఓవర్లో జల్లులు పడగా ఆటను అంపైర్లు కొద్దిసేపు ఆపేశారు. తిరిగి కాసేపటికి ఆట ప్రారంభం కాగా, 13వ ఓవర్ జరుగుతుండగా భారీ వర్షం మొదలైంది. దీంతో మరోసారి గేమ్ నిలిచిపోయింది. ప్రస్తుతం స్కోర్ AUS 28/0గా ఉంది. బ్రిస్బేన్‌లో శనివారం నుంచి సోమవారం వరకు వర్షాలు పడతాయని ఆ దేశ వాతావరణ శాఖ ముందుగానే తెలిపింది.
News December 14, 2024
అల్లు అర్జున్‌తోపాటు మరో ఇద్దరు విడుదల
సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారంలో అల్లు అర్జున్‌తోపాటు మరో ఇద్దరిని బెయిల్‌పై విడుదల చేసినట్లు చంచల్‌గూడ జైలు అధికారులు తెలిపారు. సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని కూడా రిలీజ్ చేసినట్లు వెల్లడించారు. భద్రతా కారణాల రీత్యా వెనుక గేటు నుంచి వారిని బయటకు పంపించినట్లు చెప్పారు. నిన్న రాత్రి 10 గంటల తర్వాత బెయిల్ అందడంతో ఇవాళ ఉదయం 6.45 గంటలకు విడుదల చేసినట్లు పేర్కొన్నారు.