News August 20, 2024
గుండెపోటుతో నాలుగో తరగతి బాలుడు మృతి

TG: వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు కలవరపెడుతున్నాయి. తాజాగా వరంగల్ జిల్లా తిమ్మరాయినిపహాడ్కి చెందిన నాలుగో తరగతి విద్యార్థి అక్షిత్(10) గుండె పోటుతో మరణించాడు. ఛాతీలో నొప్పి ఉందని అతను చెప్పడంతో పేరెంట్స్ వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే శ్వాస లేకపోవడంతో సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. హార్ట్ అటాక్‌తో బాలుడు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
Similar News
News December 1, 2025
HYDలో NEW YEAR సెలబ్రేషన్స్.. పర్మిషన్ తప్పనిసరి!

న్యూ ఇయర్-2026 ఈవెంట్లకు ముందస్తు అనుమతులు తప్పనిసరి అని సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. 21-12-2025లోపు దరఖాస్తులను https://cybpms.telangana.gov.in/ వెబ్సైట్లో సమర్పించాలని సూచించారు. కమర్షియల్/టికెటెడ్ ఈవెంట్లకు ఒక ఫారం, టికెట్ లేకుండా జరిగే ఈవెంట్లు నాన్ కమర్షియల్ ఫారంలో వివరాలు ఫిల్ చేయాలన్నారు. ఫిజికల్ అప్లికేషన్లకు అంగీకారం లేదని, DEC 21 తర్వాత దరఖాస్తులు తీసుకోమని పోలీసులు వెల్లడించారు.
News December 1, 2025
CM చంద్రబాబుపై లిక్కర్ కేసు మూసివేత

AP: సీఎం చంద్రబాబుపై ఉన్న లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ హయాంలో నమోదైన ఈ కేసు దర్యాప్తును ముగిస్తూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. అవకతవకలు జరిగినట్లు ఆధారాలు లేవని పేర్కొంది. దాని ఆధారంగా ఏసీబీ కోర్టు కేసును మూసేసింది. అలాగే ఆయనపై ఉన్న ఫైబర్‌నెట్ కేసును క్లోజ్ చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
News December 1, 2025
₹50వేల కోట్ల దావా.. AERA పక్షాన కేంద్రం!

ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల ప్రైవేట్ ఆపరేటర్లు, ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ (AERA) ఆఫ్ ఇండియా మధ్య ₹50వేల కోట్ల దావా SCకు చేరింది. ఇందులో కేంద్రం AERA పక్షాన నిలిచింది. రెగ్యులేటెడ్ సర్వీసెస్ కోసం కాలిక్యులేట్ చేసే అసెట్స్ క్యాపిటల్ వ్యాల్యూపై విభేదాలున్నాయి. ఆపరేటర్లు గెలిస్తే ఢిల్లీ ఎయిర్‌పోర్టులో యూజర్ డెవలప్మెంట్ ఫీజు ₹129 నుంచి ₹1261కి, ముంబైలో ₹175 నుంచి ₹3,856కు పెరుగుతుంది.


