News August 20, 2024
గుండెపోటుతో నాలుగో తరగతి బాలుడు మృతి
TG: వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు కలవరపెడుతున్నాయి. తాజాగా వరంగల్ జిల్లా తిమ్మరాయినిపహాడ్‌కి చెందిన నాలుగో తరగతి విద్యార్థి అక్షిత్(10) గుండె పోటుతో మరణించాడు. ఛాతీలో నొప్పి ఉందని అతను చెప్పడంతో పేరెంట్స్ వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే శ్వాస లేకపోవడంతో సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. హార్ట్ అటాక్‌తో బాలుడు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
Similar News
News October 12, 2024
కాళీ దేవి కిరీటం చోరీని ఖండించిన భారత్
బంగ్లాదేశ్‌లోని ఓ ఆలయంలో PM మోదీ సమర్పించిన కాళీ దేవి కిరీటం చోరీకి గురైన ఘటనను భారత్ ఖండించింది. దీన్ని ఉద్దేశపూర్వకంగా చేసిన అపవిత్ర చర్యగా పేర్కొంది. తాంతిబజార్‌లోని పూజా మండపంపై దాడి, సత్ఖిరాలోని జేషోరేశ్వరి కాళీ ఆలయంలో చోరీ ఘటనలను ఆందోళనకర చర్యలుగా గుర్తించినట్టు విదేశాంగ శాఖ తెలిపింది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ ఘటనలు శోచనీయమని పేర్కొంది.
News October 12, 2024
దసరా ఎఫెక్ట్.. జోరుగా మద్యం విక్రయాలు
దసరా సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే గత 5 రోజుల్లో విక్రయాలు 25శాతం పెరిగినట్లు ఎక్సైజ్ శాఖ అంచనా. సగటున రూ.1.20 లక్షల కేసుల మద్యం, 2 లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరిగాయి. ఈనెల 10న రికార్డు స్థాయిలో రూ.139 కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి వైన్ షాపులకు తరలింది. ఇక ఈనెల 1 నుంచి 8 వరకు మొత్తం రూ.852.38 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.
News October 12, 2024
హరిహర వీరమల్లుపై క్రేజీ అప్‌డేట్
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘హరిహర వీరమల్లు’ మూవీ గురించి అప్‌డేట్ వచ్చేసింది. త్వరలో ‘బ్యాటిల్ ఆఫ్ ధర్మ’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తామని నిర్మాత ఎ.ఎమ్ రత్నం విజయదశమి సందర్భంగా వెల్లడించారు. ఆ పాటను పవన్ కళ్యాణ్ పాడారని తెలిపారు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 28న థియేటర్లలో విడుదల కానుంది.