News August 27, 2024
ఫ్రీ బస్ ఎఫెక్ట్.. 64 శాతం ప్రయాణికులు వారే
TG: మహాలక్ష్మి పథకం అమలుతో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. ప్రతి ముగ్గురిలో ఇద్దరు స్త్రీలే ఉంటున్నారు. DEC 9 నుంచి ఈ నెల 19 వరకు 122 కోట్ల మంది ప్రయాణించగా, వారిలో 79 కోట్ల మంది(64.47%) మహాలక్ష్ములే. హనుమకొండ సిటీ బస్సుల్లో ఏకంగా 82% మంది మహిళలే ఉన్నారు. రీజియన్ల వారీగా చూస్తే GHMC(67.45%) తొలి స్థానంలో ఉండగా, తర్వాత కరీంనగర్(67.37%), నిజామాబాద్(65.17%), మెదక్(64.67%) ఉన్నాయి.
Similar News
News September 17, 2024
బాలాపూర్ లడ్డూ వేలం ద్వారా వచ్చిన డబ్బులను ఏం చేస్తారో తెలుసా?
1994 నుంచి బాలాపూర్ <<14121640>>లడ్డూ<<>> వేలం ద్వారా వచ్చిన డబ్బులను గ్రామాభివృద్ధికి ఉపయోగిస్తున్నారు. స్కూల్, రోడ్లు, ఆలయాల నిర్మాణం, సీసీ కెమెరాల ఏర్పాటు, వరద బాధితులను ఆదుకునేందుకు ఆ నిధులను ఉపయోగించారు. దేని కోసం ఎంత వెచ్చించారో అందరికీ తెలిసేలా బోర్డులను సైతం ఏర్పాటు చేస్తారు. వేలం ద్వారా వచ్చిన డబ్బులతో తమ ఊరి రూపురేఖలు మారిపోయాయని గ్రామస్థులు చెబుతున్నారు.
News September 17, 2024
సీఎం చంద్రబాబుని కలిసిన వైఎస్ సునీత
AP: వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత దంపతులు సీఎం చంద్రబాబుని కలిశారు. వివేకా హత్య కేసును విచారించిన అప్పటి సీబీఐ ఎస్పీ రాంసింగ్‌తో పాటు తనపై గత ప్రభుత్వంలో అక్రమ కేసు పెట్టారని సునీత ఆరోపించారు. వివేకా పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు కుట్రపూరితంగా వ్యవహరించారని తెలిపారు. కృష్ణారెడ్డి ఫిర్యాదులో నిజానిజాలపై విచారణ చేయించాలని సీఎం చంద్రబాబుని సునీత కోరారు.
News September 17, 2024
మయన్మార్‌లో ‘యాగీ’ బీభత్సం.. 236 మంది మృతి
మయన్మార్‌లో యాగీ తుఫాన్ బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలకు వరదలు, కొండచరియలు విరిగి పడిన ఘటనలో 236 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. మరో 77 మంది గల్లంతైనట్లు చెప్పారు. అయితే మరణాల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. 6.31 లక్షల మంది వరదలకు ప్రభావితమైనట్లు పేర్కొన్నారు. పెద్ద ఎత్తున రోడ్లు దెబ్బతినడంతో పాటు ఆస్తి నష్టం వాటిల్లింది.