News August 1, 2024

హెల్త్ పెన్షన్లు అందుకునే వారికి ఉచిత బస్సు ప్రయాణం!

image

AP: తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ పింఛన్లు అందుకునే వారికి ఉచిత బస్సు పాస్‌లు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనివల్ల గుండె, లివర్, కిడ్నీ జబ్బులు, తలసేమియా, పక్షపాతం, లెప్రసీ, హీమోఫిలియా సమస్యలున్న 51 వేల మందికి మేలు జరగనుంది. చికిత్స కోసం పట్టణాల్లోని ఆస్పత్రులకు వచ్చి వెళ్లేందుకు రోగులు రూ.200 నుంచి రూ.600 భరించాల్సి వస్తోంది. ఉచిత ప్రయాణం అమలు చేస్తే ఈ ఖర్చు నుంచి ఉపశమనం లభించనుంది.

Similar News

News November 16, 2025

BREAKING: భారత్ ఓటమి

image

సౌతాఫ్రికాతో తొలి టెస్టులో భారత్‌కు ఊహించని షాక్ ఎదురైంది. 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఓటమి పాలైంది. టీమ్ ఇండియా 93 పరుగులకే పరిమితమైంది. దీంతో RSA 30 పరుగుల తేడాతో గెలిచింది. సుందర్ 31, అక్షర్ 26, జడేజా 16 రన్స్ చేశారు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. మెడనొప్పితో గిల్ సెకండ్ ఇన్నింగ్సులో బ్యాటింగ్‌కు రాలేదు. SA బౌలర్లలో హార్మర్ 4, జాన్సెన్ 3 వికెట్లతో సత్తా చాటారు.

News November 16, 2025

2028 నాటికి చంద్రయాన్-4 పూర్తి: నారాయణన్

image

ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 7 ప్రయోగాలు చేయనున్నట్లు ఇస్రో ఛైర్మన్ నారాయణన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. వీటిలో PSLV, గగన్‌యాన్ మిషన్లతోపాటు ఓ కమర్షియల్ శాటిలైట్ ప్రయోగమూ ఉందని చెప్పారు. ‘చంద్రయాన్-4కు కేంద్రం ఆమోదం తెలిపింది. 2028 నాటికి చంద్రుడి నుంచి మట్టి నమూనాలను తీసుకురావడమే దీని లక్ష్యం. 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రం నిర్మాణాన్ని పూర్తిచేస్తాం’ అని వివరించారు.

News November 16, 2025

ఆడపిల్లల చదువు ఆపేస్తున్నారు: కవిత

image

TG: మగ పిల్లల చదువు కోసం అప్పులు చేసైనా ప్రైవేట్ స్కూళ్లకు పంపుతున్నారు కానీ ఆడపిల్లలను మాత్రం ఆపేస్తున్నారని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. విద్యావ్యవస్థ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘ఆడపిల్లల చదువు చాలా డెలికేటెడ్ సమస్యగా మారింది. బస్సు లేకపోయినా, వీధి దీపం లేకపోయినా సరే ఆడపిల్లల చదువు ఆపేస్తున్నారు. బాలికల విద్య, ఉద్యోగానికి సంబంధించి సపరేట్ విధానం అమలు చేయాలి’ అని తెలిపారు.