News August 1, 2024
హెల్త్ పెన్షన్లు అందుకునే వారికి ఉచిత బస్సు ప్రయాణం!
AP: తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ పింఛన్లు అందుకునే వారికి ఉచిత బస్సు పాస్‌లు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనివల్ల గుండె, లివర్, కిడ్నీ జబ్బులు, తలసేమియా, పక్షపాతం, లెప్రసీ, హీమోఫిలియా సమస్యలున్న 51 వేల మందికి మేలు జరగనుంది. చికిత్స కోసం పట్టణాల్లోని ఆస్పత్రులకు వచ్చి వెళ్లేందుకు రోగులు రూ.200 నుంచి రూ.600 భరించాల్సి వస్తోంది. ఉచిత ప్రయాణం అమలు చేస్తే ఈ ఖర్చు నుంచి ఉపశమనం లభించనుంది.
Similar News
News December 11, 2024
రాష్ట్రంలో కొత్త టూరిజం పాలసీ
AP: రాష్ట్ర ప్రభుత్వం కొత్త టూరిజం పాలసీని విడుదల చేసింది. వచ్చే ఐదేళ్లలో ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పన లక్ష్యంగా కొత్త విధానం తీసుకొచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. పర్యాటక ప్రాజెక్టులకు సంబంధించి మౌలిక సదుపాయాలు కల్పించడమే పాలసీ ముఖ్య ఉద్దేశమంది. ఎకో, క్రూయిజ్, బ్యాక్ వాటర్ టూరిజం, బీచ్ సర్క్యూట్‌లను ప్రోత్సహించడంతో పాటు ఆయా రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించేలా పాలసీ రూపొందించినట్లు వివరించింది.
News December 11, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News December 11, 2024
మోహన్‌బాబు బౌన్సర్ల బైండోవర్‌కు ఆదేశం
TG: హైదరాబాద్ జల్‌పల్లిలో మోహన్‌బాబు నివాసం వద్ద జరిగిన మీడియాపై దాడి ఘటనను పోలీస్‌శాఖ సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో ఆయన చుట్టూ ఉన్న బౌన్సర్లను బైండోవర్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా ఆయనతో పాటు విష్ణు వద్ద ఉన్న గన్లను డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించి రేపు ఉదయం విచారణకు రావాలని వీరిద్దరితో పాటు మనోజ్‌కు రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.