News January 18, 2025

ఫ్రీ కోచింగ్.. ఫిబ్రవరి 15 నుంచి తరగతులు

image

TG: BC స్టడీ సర్కిళ్లలో RRB, SSC, బ్యాంకింగ్ తదితర రిక్రూట్‌మెంట్లకు ఫ్రీ కోచింగ్ తరగతులు ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కానున్నాయి. అభ్యర్థులు JAN 20 నుంచి FEB 9 వరకు అప్లై చేసుకోవాలి. ఇంటర్, డిగ్రీ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. FEB 12-14 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. అభ్యర్థుల తల్లిదండ్రుల ఆదాయం గ్రామాల్లో ₹2L, పట్టణాల్లో ₹1.50Lకు మించకూడదు.
వెబ్‌సైట్: https://tgbcstudycircle.cgg.gov.in/

Similar News

News February 18, 2025

విడదల రజినీకి హైకోర్టులో ఊరట

image

AP: మాజీ మంత్రి విడదల రజినీకి హైకోర్టులో ఊరట దక్కింది. తన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు రజినీ, ఆమె PAలపై కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. YCP హయాంలో చిలకలూరిపేట టౌన్ CI సూర్యనారాయణ తనను హింసిస్తూ వీడియోను అప్పటి MLA రజినీకి చూపించారని పిల్లి కోటి అనే వ్యక్తి PSలో ఫిర్యాదు చేశారు. దీంతో రజినీ, PAలపై కేసులు నమోదైన విషయం తెలిసిందే.

News February 18, 2025

ఛాంపియన్స్ ట్రోఫీకి మరో స్టార్ బౌలర్ దూరం

image

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు న్యూజిలాండ్ జట్టుకు కీలక బౌలర్ దూరమయ్యారు. కుడి పాదానికి గాయం కారణంగా లోకి ఫెర్గూసన్ టోర్నీ మొత్తానికి దూరమైనట్లు న్యూజిలాండ్ ప్రకటించింది. అతడి స్థానంలో జెమిసన్‌ను తీసుకున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే ఆస్ట్రేలియా, భారత్‌కు స్టార్ బౌలర్లు దూరమైన సంగతి తెలిసిందే. కీలక బౌలర్లు దూరమవడంతో బ్యాటర్లకు ఈ టోర్నీ పండగే కానుందని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

News February 18, 2025

తారకరత్న వర్ధంతి వేళ భార్య ఎమోషనల్ పోస్ట్

image

నందమూరి తారకరత్న వర్ధంతి వేళ ఆయన సతీమణి అలేఖ్య భావోద్వేగానికి గురయ్యారు. ‘విధి వక్రించి మిమ్మల్ని మా నుంచి దూరం చేసింది, నువ్వులేని లోటు లోకంలో ఏది పూరించలేదు. మీ జ్ఞాపకాలు మా చుట్టూనే తిరుగుతున్నాయి’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తారకరత్న ఫొటో ముందు పిల్లలతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. రెండేళ్ల క్రితం యువగళం పాదయాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుతో మరణించారు.

error: Content is protected !!