News November 20, 2024

వారికి 500 యూనిట్ల వరకు విద్యుత్ ఫ్రీ: మంత్రి సవిత

image

AP: రాష్ట్రంలో మరమగ్గాలు ఉన్న వారికి 500 యూనిట్లు, చేనేత మగ్గాలు ఉన్నవారికి 200 యూనిట్ల వరకు విద్యుత్ ఫ్రీ అని మంత్రి సవిత తెలిపారు. హెల్త్ ఇన్సూరెన్స్, 5% GST రీయింబర్స్‌మెంట్ కల్పిస్తామని చెప్పారు. ‘కర్నూలు, విజయనగరంలో చేనేత శాలలు ఏర్పాటు చేస్తాం. ఇందుకు స్థానిక MPలు రూ.కోటి చొప్పున నిధులు కేటాయించారు. చేనేత వస్త్రాల మార్కెటింగ్ కోసం విదేశాల్లో ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేస్తాం’ అని ఆమె తెలిపారు.

Similar News

News December 10, 2024

బాక్సింగ్ డే టెస్ట్.. ఫస్ట్ డే టికెట్లన్నీ సేల్

image

ఆస్ట్రేలియాలో బాక్సింగ్ డే టెస్టుకు ఉన్న క్రేజే వేరు. ఆ మ్యాచ్ తొలి రోజుకు సంబంధించి టికెట్లన్నీ ఇప్పటికే అమ్ముడుపోయినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ట్వీట్ చేసింది. ఈ నెల 26న మెల్‌బోర్న్ వేదికగా భారత్‌తో మ్యాచ్ జరగనుండగా ఇక్కడ సిట్టింగ్ కెపాసిటీ లక్షగా ఉంది. మ్యాచ్‌కు 15 రోజుల ముందే టికెట్లన్నీ అమ్ముడవడం గమనార్హం. కాగా మూడో టెస్టు ఈ నెల 14న గబ్బా స్టేడియంలో జరగనుంది.

News December 10, 2024

మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల దోపిడీ: AISF

image

మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల దోపిడీపై AP ప్రభుత్వం విచారణ చేయించాలని AISF జాతీయ కార్యదర్శి శివారెడ్డి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ‘MBUలో ఫీజుల దోపిడీపై మంచు మనోజ్ స్టేట్‌మెంట్‌ను సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలి. ప్రతి విద్యార్థి దగ్గర ఏటా ₹20,000 అధికంగా వసూలు చేస్తున్నారు. ప్రశ్నించిన పేరెంట్స్‌ను మోహన్ బాబు బౌన్సర్లతో కొట్టిస్తున్నారు. స్టూడెంట్స్‌ను ఫెయిల్ చేయిస్తున్నారు’ అని ఆరోపించారు.

News December 10, 2024

ప్రజా సమస్యల పోరాటంపై తగ్గేదేలే: సజ్జల

image

AP: ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటామని YCP స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీ నేతలతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘ప్రజల గొంతుకగా మనం ప్రభుత్వాన్ని నిలదీయాలి. సమస్యలపై సర్కార్ దిగొచ్చేవరకూ బాధితులకు అండగా నిలవాలి. కూటమి ప్రభుత్వంపై కలిసికట్టుగా పోరాడాలి’ అని ఆయన నేతలకు దిశానిర్దేశం చేశారు.