News April 25, 2024
ఓటేస్తే ఫ్రీగా ఐస్‌క్రీమ్, జిలేబీ!
మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని ఆహార దుకాణాల యజమానులు ఓటర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. పోలింగ్ మొదలైన తొలి గంటల్లో ఓటేసేవారికి జిలేబీ, ఐస్‌క్రీమ్, అటుకుల ఉప్మా ఫ్రీగా అందిస్తామని తెలిపారు. ఈ మేరకు కలెక్టర్‌తో సమావేశం అనంతరం దుకాణదారుల సంఘం మీడియాకు తెలిపింది. ఎన్నికల పోలింగ్‌లో ఓటర్లు పెద్దఎత్తున పాల్గొనాలని కోరుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
Similar News
News January 18, 2025
‘డాకు మహారాజ్’ కలెక్షన్లు @రూ.124+కోట్లు
నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కించిన ‘డాకు మహారాజ్’ చిత్రం కలెక్షన్లు భారీగా రాబడుతోంది. ఈ చిత్రానికి ఆరు రోజుల్లోనే రూ.124+కోట్లు (గ్రాస్) వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. ‘బ్లాక్ బస్టర్.. కింగ్ ఆఫ్ సంక్రాంతి’ అంటూ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. నేడు, రేపు వీకెండ్స్ కావడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని సినీవర్గాలు పేర్కొన్నాయి.
News January 18, 2025
ఈ నెలాఖరు నుంచి అల్లు అర్జున్ కొత్త మూవీ షురూ?
పుష్ప-2 హిట్‌తో జోష్ మీదున్న అల్లు అర్జున్ కొత్త ప్రాజెక్టుపై దృష్టిసారించారు. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో చేయనున్న మూవీ ఈ నెలాఖరు నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. బన్నీ న్యూలుక్‌తో ఓ స్పెషల్ అనౌన్స్‌మెంట్ వీడియోను రిలీజ్ చేస్తారని టాక్. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు త్వరలో వెల్లడిస్తారని తెలుస్తోంది. వీరి కాంబోలో జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే.
News January 18, 2025
94 శాతం మందికి ‘ఆత్మీయ భరోసా’ కట్: హరీశ్ రావు
TG: రాష్ట్రంలో 1.4 కోట్ల మంది ఉపాధి కూలీలుంటే 94 శాతం మందికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం చూస్తోందని BRS MLA హరీశ్ రావు ఆరోపించారు. దళితులు, గిరిజనుల, బీసీల నోళ్లు కొట్టడానికి చేతులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. 20 రోజులు పనిచేసేవారికి అని నిబంధనలు పెట్టడం, గుంట భూమి ఉన్నా అనర్హులుగా చేయడం సరికాదన్నారు. ప్రభుత్వ మోసంపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.