News June 15, 2024

BRS హయాం నుంచే విద్యార్థులకు ఫ్రీ జర్నీ: హరీశ్ రావు

image

TG: ఉచిత బస్సు సౌకర్యంతో బాలికలు స్కూళ్లకు వెళ్తుండటం ఆనందాన్ని కలిగిస్తోందని సీఎం రేవంత్ చేసిన <<13438097>>ట్వీట్‌పై<<>> హరీశ్ ‌రావు విమర్శలు గుప్పించారు. ‘కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఉచిత ప్రయాణ పథకం ద్వారానే బాలికలు పాఠశాలలకు వెళ్తున్నట్టు సీఎం గొప్పలు చెప్పడం హాస్యాస్పదం. విద్యార్థులకు ఫ్రీ జర్నీ BRS హయాం నుంచే అమల్లో ఉంది. గత ప్రభుత్వ పథకాలను INC నేతలు తమ ఖాతాలో వేసుకోవడం శోచనీయం’ అని ట్వీట్ చేశారు.

Similar News

News September 19, 2024

వేమన నీతి పద్యం- తాత్పర్యం

image

కర్మ మధికమైన గడచి పోవగరాదు
ధర్మరాజు దెచ్చి తగని చోట
గంకుభట్టు జేసెగటకటా దైవంబు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: కర్మ ఎవరినీ వదిలిపెట్టదు. ప్రతికూల సమయం వచ్చినప్పుడు ధర్మరాజు కూడా విరాట రాజువద్ద కంకుభట్టు వేషాన్ని ధరించాల్సి వచ్చింది.

News September 19, 2024

ఈ ఫొటోలోని క్రికెటర్‌ను గుర్తు పట్టారా?

image

ఈ ఫొటోలో భారత క్రికెట్ గేమ్ ఛేంజర్ ఉన్నారు. ఆడిన తొలి రెండు టెస్టుల్లోనూ సెంచరీలు బాదారు. వన్డేల్లో 10 వేలకుపైగా పరుగులు, 100కుపైగా వికెట్లు, 100కుపైగా క్యాచ్‌లు పట్టారు. ఆయన నాయకత్వంలో వన్డే వరల్డ్ కప్ త్రుటిలో చేజారింది. 100కు పైగా టెస్టులు, 300కు పైగా వన్డేలు ఆడారు. ఐపీఎల్‌లో PWI, KKRకు ప్రాతినిథ్యం వహించారు. ఆయన ఎవరో గుర్తు పట్టి కామెంట్ చేయండి.

News September 19, 2024

మరో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్

image

UPలోని బృందావన్ రోడ్ స్టేషన్ సమీపంలో బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్సు రైలు పట్టాలు తప్పింది. 20 బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటనతో ఢిల్లీ-మథుర మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. యుద్ధప్రాతిపదికన ఆ రూట్‌ను క్లియర్ చేసేందుకు రైల్వే సిబ్బంది శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఇటీవలకాలంలో దేశంలో వరుస రైలు ప్రమాదాలు కలవరపెడుతున్నాయి.