News March 7, 2025

త్వరలో ఉచిత ఆన్‌లైన్ డీఎస్సీ కోచింగ్: మంత్రి

image

AP: బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో త్వరలో ఉచిత ఆన్‌లైన్ డీఎస్సీ కోచింగ్ ప్రారంభించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ఈ నెల 10 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. BC, EWS అభ్యర్థులు ఈ శిక్షణకు అర్హులని, టెట్‌లో ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ జిల్లాలకు చెందిన బీసీ సంక్షేమ శాఖాధికారులను సంప్రదించాలని మంత్రి వివరించారు.

Similar News

News March 22, 2025

ఆ రైతులకు పరిహారం చెల్లించాలి: బండి

image

TG: గత పదేళ్లలో పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్ హయాంలోనూ ఆదుకున్న దాఖలాలు లేవని దుయ్యబట్టారు. వడగళ్ల వానతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తక్షణమే సర్వే చేసి వారం రోజుల్లో నష్టపోయిన రైతులను ఆదుకోవాలన్నారు. మరోవైపు ప్రజల దృష్టి మరల్చేందుకు డీలిమిటేషన్‌పై అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారని ఫైరయ్యారు.

News March 22, 2025

ఫోన్ చూస్తూ తింటున్నారా.. జాగ్రత్త!

image

చాలామందికి తినే సమయంలోనూ ఫోన్ చూసే అలవాటు ఉంటుంది. ప్లేటులో ఏముందో కూడా పట్టించుకోకుండా తినేవారు ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరమైన అలవాటని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘తినే ప్రతి ముద్దను ఆస్వాదిస్తే అరుగుదల మెరుగ్గా ఉంటుంది. దృష్టి ఫోన్‌పై ఉంటే ఎంత తింటున్నామో, ఏం తింటున్నామో కూడా మనకు తెలీదు. దీని వల్ల పోషకాహార లోపమో లేక ఊబకాయం రావడమో జరుగుతుంది. రెండూ ప్రమాదమే’ అని వివరిస్తున్నారు.

News March 22, 2025

అంతరిక్ష కేంద్రం భూమిపై కూలుతుందా?

image

ఎన్నో అంతరిక్ష ప్రయోగాలకు వేదికైన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) భూమి నుంచి 415 కి.మీల ఎత్తులో ఉంది. 2031లో ఈ ISS మిషన్ పూర్తవనుంది. దీంతో 109 మీటర్ల పొడవున్న ISS తన కక్ష్య నుంచి పూర్తిగా వైదొలిగి భూమి దిశగా రానుంది. ఈక్రమంలో అట్మాస్పిరిక్ డ్రాగ్ ప్రభావంతో ISS తనంతట తాను ధ్వంసం అయ్యేలా NASA చేయనుంది. మిగిలిన భాగాలు పసిఫిక్ సముద్రంలోని ‘పాయింట్ నెమో’ (అంతరిక్ష వ్యర్థాల వాటిక)లో పడేలా చేస్తారు.

error: Content is protected !!