News January 23, 2025

వారికి ప్రైవేట్ స్కూళ్లలో ఉచితంగా సీట్లు!

image

TG: వచ్చే ఏడాది నుంచి ప్రైవేట్ బడుల్లో 25% సీట్లు పేద విద్యార్థులకు కేటాయించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ విషయాన్ని ఇప్పటికే హైకోర్టుకు తెలుపగా, ఎలా అమలు చేయాలనేదానిపై ఉన్నతాధికారులు సమాలోచనలు చేస్తున్నారు. దేశంలో 2009లో తీసుకొచ్చిన విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రీ ప్రైమరీ, ఒకటో తరగతిలో 25% సీట్లు పేదలకు ఇవ్వాల్సి ఉంటుంది. దేశంలో TGతో పాటు మరో 6 రాష్ట్రాలు మాత్రమే దీనిని అమలు చేయడం లేదు.

Similar News

News November 18, 2025

బనకచర్ల పేరు మార్చి అనుమతులకు ఏపీ యత్నం: ఉత్తమ్

image

SC స్టే ఉన్నా ఆల్మట్టి ఎత్తు పెంచేందుకు కర్ణాటక ప్రయత్నిస్తోందని TG మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఎత్తు పెంచొద్దని కోర్టు చెప్పిందన్నారు. కేంద్ర మంత్రి CR పాటిల్‌తో భేటీ అనంతరం ఆయన మాట్లాడారు. ‘పోలవరం-బనకచర్లను వ్యతిరేకించాం. పేరు మార్చి AP అనుమతులకు యత్నిస్తోంది. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేశాం. ప్రాణహిత-చేవెళ్ల, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు నిధులు కోరాం’ అని మంత్రి వివరించారు.

News November 18, 2025

వాట్సాప్ ఛానెల్ ద్వారా ‘జైషే’ ఉగ్ర ప్రచారం

image

ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ డిజిటల్ నెట్వర్క్ ద్వారా యువతను టెర్రరిజమ్ వైపు మళ్లిస్తోంది. ఈ సంస్థకు సంబంధించిన వాట్సాప్ ఛానెల్‌ను నిఘా సంస్థలు గుర్తించాయి. ఈ ఛానెల్‌కు 13వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. దీని ద్వారా వేలాది మందిని ఉగ్రమూకలుగా JeM మారుస్తోంది. కాగా ఢిల్లీ పేలుళ్ల కేసులో అరెస్టు చేసిన డానిష్‌ను పోలీసులు పటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. అతడిని 10 రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీకి అప్పగించింది.

News November 18, 2025

24 ఆసుపత్రుల్లో క్రిటికల్ కేర్ బ్లాక్‌లు: సత్యకుమార్ యాదవ్

image

AP: అత్యవసర వైద్య సేవల కోసం 24 ఆసుపత్రుల్లో క్రిటికల్ కేర్ బ్లాక్(CCB)లు అందుబాటులోకి రానున్నాయి. PMABHIM కింద ₹600 కోట్లతో వీటిని ఏర్పాటుచేస్తున్నారు. వీటి పురోగతిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సమీక్షించారు. వీటిలో 13 వచ్చే నెలాఖరుకు, మిగతావి 2026 ఆగస్టు నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు. కోవిడ్‌లో అత్యవసర వైద్యానికి ఇబ్బంది అయ్యింది. అటువంటివి మళ్లీ రాకుండా కేంద్రం దేశంలో 621 CCBలను నెలకొల్పుతోంది.