News January 23, 2025

వారికి ప్రైవేట్ స్కూళ్లలో ఉచితంగా సీట్లు!

image

TG: వచ్చే ఏడాది నుంచి ప్రైవేట్ బడుల్లో 25% సీట్లు పేద విద్యార్థులకు కేటాయించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ విషయాన్ని ఇప్పటికే హైకోర్టుకు తెలుపగా, ఎలా అమలు చేయాలనేదానిపై ఉన్నతాధికారులు సమాలోచనలు చేస్తున్నారు. దేశంలో 2009లో తీసుకొచ్చిన విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రీ ప్రైమరీ, ఒకటో తరగతిలో 25% సీట్లు పేదలకు ఇవ్వాల్సి ఉంటుంది. దేశంలో TGతో పాటు మరో 6 రాష్ట్రాలు మాత్రమే దీనిని అమలు చేయడం లేదు.

Similar News

News February 16, 2025

భారత్‌కు వారసులు హిందువులే: మోహన్ భాగవత్

image

దేశంలో హిందూ సమాజమే బాధ్యతాయుతమైనదని RSS చీఫ్ మోహన్ భాగవత్ చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వం ఉంటుందనే సత్యాన్ని హిందువులు విశ్వసిస్తారన్నారు. బెంగాల్‌లో మాట్లాడుతూ భారత్‌కు వారసులు హిందువులేనని పేర్కొన్నారు. ‘పాలకులు, మహారాజులను దేశం గుర్తుంచుకోదు. కానీ తండ్రి మాటకు కట్టుబడి 14ఏళ్ల వనవాసం చేసిన రాజును, సోదరుడి చెప్పులతో పాలన చేసిన వ్యక్తిని గుర్తుంచుకుంటుంది’ అని తెలిపారు.

News February 16, 2025

నెక్స్ట్ టార్గెట్ కొడాలి, పేర్ని నానిలే: మంత్రి కొల్లు

image

AP: వైసీపీ నేతలు చేసిన పాపాలే వారిని జైలుపాలు చేస్తున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు అనేక తప్పులు చేస్తున్నారని విమర్శించారు. ‘నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది కొడాలి నాని, పేర్ని నానిలే. వైసీపీ హయాంలో వీరిద్దరూ అవినీతి, అరాచకాలకు పాల్పడ్డారు. వీటిపై విచారణ చేసి వీరిని జైలుకు పంపుతాం’ అని ఆయన హెచ్చరించారు.

News February 16, 2025

ప్రభాస్ లేటెస్ట్ PHOTO చూశారా?

image

రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ ఫొటో వైరలవుతోంది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రభాస్‌ను కలిసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు రావాలని కోరుతూ ఆహ్వానపత్రిక అందజేశారు. ఈ ఫొటోను షేర్ చేస్తూ లాంగ్ హెయిర్‌లో డార్లింగ్ లుక్ అదిరిపోయిందని అభిమానులు పోస్టులు చేస్తున్నారు. ప్రస్తుతం ది రాజాసాబ్, ఫౌజీ సినిమాల్లో ప్రభాస్ నటిస్తున్నారు.

error: Content is protected !!