News April 12, 2025
ఆ రైతులకు ఉచిత విత్తనాలు ఇవ్వాలి: హరీశ్ రావు

TG: కాంగ్రెస్ ప్రభుత్వం పంటలకు బీమా ఇవ్వలేదని హరీశ్ రావు దుయ్యబట్టారు. రైతు బీమా కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సిద్దిపేటలోని రాజగోపాల్ పేటలో అకాలవర్షాలకు దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. వడగళ్లతో పంట నష్టపోయిన రైతులకు ఉచిత విత్తనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో రైతుబంధు, రైతుబీమా ఇచ్చామని గుర్తు చేశారు.
Similar News
News April 19, 2025
ఓ దశకు ఉక్రెయిన్, రష్యా మధ్య చర్చలు: ట్రంప్

కాల్పుల విరమణపై ఉక్రెయిన్, రష్యా మధ్య చర్చలు ఓ దశకు వచ్చాయని US అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. దీర్ఘకాలిక వివాదాన్ని ముగించేందుకు తాను ఏ ఒక్కరికీ అనుకూలంగా లేనట్లు చెప్పారు. ఈ చర్చలను పుతిన్, జెలెన్స్కీలలో ఎవరు కష్టతరం చేసినా వారిని మూర్ఖులుగా పరిగణిస్తామన్నారు. ఆపై శాంతి ఒప్పందలో మధ్యవర్తిత్వం నుంచి వైదొలుగుతామని తెలిపారు. అయితే, కాల్పుల విరమణ ఒప్పందం ఆలస్యమైతే US ముందడుగు వేస్తుందని వెల్లడించారు.
News April 19, 2025
ఇది నమ్మశక్యంగా లేదు: రోహిత్ శర్మ

వాంఖడే స్టేడియంలో స్టాండ్కు తన పేరును పెట్టడంపై రోహిత్ శర్మ భావోద్వేగానికి గురయ్యారు. ‘నా ఫేవరెట్ రంజీ ప్లేయర్లను చూసేందుకు వాంఖడే బయట ఎదురుచూస్తూ ఉండేవాడిని. స్టేడియంలోకి అందర్నీ రానిచ్చేవారు కాదు. అలాంటిది అదే స్టేడియంలో నా పేరిట స్టాండ్ అంటే చాలా భావోద్వేగంగా ఉంది. నమ్మశక్యంగా లేదు. ఇది ఎంతోమంది క్రికెటర్లకు కల’ అని హర్షం వ్యక్తం చేశారు.
News April 19, 2025
మైనర్ మినరల్ పాలసీ రిలీజ్ చేసిన ప్రభుత్వం

AP: రాష్ట్ర ప్రభుత్వం మైనర్ ఖనిజాల పాలసీ-2025 విడుదల చేసింది. అధిక ఆదాయ సృష్టి, పెట్టుబడుల ఆకర్షణే దీని ప్రధాన లక్ష్యమని వెల్లడించింది. 2022 మార్చి 13 వరకు పెండింగ్లో ఉన్న దరఖాస్తులకే లీజు మంజూరు చేసేందుకు అంగీకారం తెలిపింది. ఇందులో భాగంగా గ్రానైట్, మార్బుల్లాంటి ఖనిజాలున్న భూములను 30ఏళ్ల పాటు లీజుకు ఇవ్వనుంది. మరోవైపు, యాన్యువల్ డెట్ రెంట్ మూడు నెలల్లోగా కట్టాలని మార్గదర్శకాలు జారీ చేసింది.