News November 15, 2024

‘సివిల్స్’కు ఉచిత శిక్షణ.. 24 వరకు దరఖాస్తులు

image

AP: యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ ప్రైమరీ, మెయిన్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ వెల్లడించింది. అర్హత గల బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈ నెల 24లోపు బీసీ సంక్షేమ సాధికార కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వాలని తెలిపింది. ఈ నెల 27న నిర్వహించే స్క్రీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ఉచిత హాస్టల్, భోజన వసతి కూడా ఉంటుంది. బీసీ 66%, ఎస్సీ 20%, ఎస్టీ 14% చొప్పున ఎంపిక చేస్తారు.

Similar News

News November 15, 2024

గుండెపోటు మరణాలు.. యువతలో ఆందోళన!

image

వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు సంభవిస్తుండటం కలకలం రేపుతోంది. వయసు పైబడిన వారే కాకుండా పిల్లలు, యువత హార్ట్ ఎటాక్‌తో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా తెలంగాణలోని జగిత్యాల(D) మోత్కూరావుపేటలో సంజీవ్ అనే యువకుడు పెళ్లి వేడుకలో డాన్స్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోగా మృతి చెందాడు.

News November 15, 2024

దేవతలు భూమ్మీదికి దిగొచ్చే ‘దేవ్ దీపావళి’ తెలుసా?

image

భక్తిశ్రద్ధలతో జరుపుకొనే కార్తీక పౌర్ణమినే ఉత్తరాదిలో దేవ్ దీపావళి అంటారు. వర గర్వంతో చావే రాదని విర్రవీగుతూ సజ్జనులను బాధిస్తున్న త్రిపురాసురులను ఆ పరమశివుడు సంహరించింది ఈరోజే. అందుకే ఆ విశ్వేశ్వరుడి దేహంలో ఒక భాగంగా భావించే కాశీ నగరంలో ఈ పండుగను అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఈసారి గంగాతీరంలో 17లక్షల దీపాలను వెలిగిస్తున్నారు. ఈ వేడుకను వీక్షించేందుకు దేవతలు భూమికి దిగొస్తారని భక్తుల నమ్మిక.

News November 15, 2024

పాకిస్థాన్‌లో బాంబు పేలుడు.. పలువురి మృతి

image

పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులో నిన్న సాయంత్రం బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు, ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులు మృతిచెందారని, 14మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. రసూల్ జాన్ అనే తాలిబాన్ ఉగ్రవాది తన ఇంటి వద్ద కారులో బాంబును బిగిస్తుండగా అది పేలిందని పేర్కొన్నారు. తాలిబాన్లు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాల్ని తరలించారని వెల్లడించారు.