News August 12, 2025

6,115 రైల్వే స్టేషన్స్‌లో ఫ్రీ వైఫై.. ఇలా పొందండి

image

6,115 రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు ఉచితంగా హైస్పీడ్ వైఫై సౌకర్యం కల్పిస్తున్నట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఓ MP ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కాచిగూడ, సికింద్రాబాద్ వంటి స్టేషన్లలోనూ ఈ సౌకర్యం ఉంది. కనెక్ట్ చేసుకునేందుకు మీ ఫోన్‌లో వైఫై ఆన్ చేయాలి. RailWire Wi-Fiని సెలక్ట్ చేయాలి. మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేస్తే.. OTP వస్తుంది. దానిని ఎంటర్ చేస్తే వైఫై కనెక్ట్ అవుతుంది.

Similar News

News August 12, 2025

అందుబాటులోకి రాని టికెట్లు.. ఏ సినిమా కోసం వెయిటింగ్?

image

ఎన్టీఆర్, హృతిక్ నటించిన ‘వార్-2’, రజినీకాంత్ నటించిన ‘కూలీ’ రెండు రోజుల్లో థియేటర్లలో విడుదల కానున్నాయి. అయినా ఈ సినిమాలకు సంబంధించి టికెట్లు ఇంకా అందుబాటులోకి రాలేదు. టికెట్ల ధరలు పెంపు, తొలి రోజు షో టైమింగ్స్‌పై స్పష్టత రాకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. దీనిపై ఇవాళ సాయంత్రం కల్లా క్లారిటీ వచ్చే అవకాశముందని సమాచారం. మీరు ఏ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు?

News August 12, 2025

డీఎస్సీ ఫలితాలు.. అభ్యర్థులకు అలర్ట్

image

AP: మెగా DSC <<17374210>>ఫలితాలు<<>> నిన్న రాత్రి విడుదలయ్యాయి. DSC నార్మలైజేషన్, టెట్ వెయిటేజీ మార్కులు కలిపి విద్యాశాఖ ఫలితాలను ప్రకటించింది. టెట్ మార్కులపై అభ్యంతరాలుంటే అప్డేట్ చేసుకునేందుకు ఇవాళ, రేపు అవకాశం కల్పించింది. అభ్యంతరాల పరిశీలన తర్వాత సవరించిన తుది మార్కులను రిలీజ్ చేయనుంది. అనంతరం జిల్లాల వారీగా జాబితాలు ప్రకటించి పోస్టులు, రిజర్వేషన్ల ప్రకారం ఎంపికైన అభ్యర్థుల వివరాలను వెల్లడించే ఛాన్స్ ఉంది.

News August 12, 2025

ఐదు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు

image

బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల 5 రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ APలోని ఉమ్మడి ప.గో., కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు తదితర జిల్లాల్లో భారీ వర్షాలకు ఆస్కారముందని పేర్కొంది. అటు TGలోనూ HYD, KNR, MHBD, మహబూబ్ నగర్, NLG తదితర జిల్లాల్లో వర్షాలు పడతాయని వెల్లడించింది.