News March 25, 2024

ఈ నెల 30 నుంచి జనంలోకి జనసేనాని

image

AP: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 30న పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారని.. అక్కడ ఉంటూనే AP వ్యాప్తంగా ప్రచారానికి వెళ్తారని పార్టీ వెల్లడించింది. తొలిరోజు శక్తిపీఠమైన శ్రీ పురుహూతిక అమ్మవారిని, అనంతరం దత్తపీఠాన్ని దర్శించుకోనున్న ఆయన.. ఆ తర్వాత మూడు రోజులు పిఠాపురంలోనే ఉంటారు. ఉగాది వేడుకలను కూడా అక్కడే పవన్ నిర్వహించుకోబోతున్నారు.

Similar News

News April 17, 2026

ఆదిలాబాద్: DOST HELP LINE సెంటర్

image

డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఆదిలాబాద్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ సంగీత తెలిపారు. ఈ నెల 15న మొదటి విడత రిజిస్ట్రేషన్లు ప్రారంభమైనట్లు పేర్కొన్నారు. జిల్లాలోని విద్యార్థులకు రిజిస్ట్రేషన్ సమయంలో ఇబ్బందులు ఎదురైతే హెల్ప్ లైన్ సెంటర్‌ను సంప్రదించాలన్నారు. ఆధార్, ఫోన్, ధ్రువపత్రాలతో రావాలన్నారు.

News April 17, 2026

బెస్ట్ కవర్ డ్రైవ్ కోహ్లీదే: సెహ్వాగ్

image

IPLలో వివిధ షాట్లను ఎవరు ఫర్‌ఫెక్ట్‌గా ఆడతారో మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ వెల్లడించారు. కవర్ డ్రైవ్- కోహ్లీ, పుల్ షాట్- వైభవ్, ఫ్లిక్ షాట్- ఆయుష్ మాత్రే, స్కూప్ షాట్, స్వీప్ షాట్- సూర్య, స్ట్రెయిట్ డ్రైవ్- సంజూ, ర్యాంప్ షాట్- డివిలియర్స్, రివర్స్ స్వీప్- ప్రభ్‌సిమ్రన్, కట్ షాట్- ప్రియాంశ్, ఇన్‌సైడ్ ఔట్- పడిక్కల్. ఈ లిస్టులో ఎవరైనా మిస్సయ్యారా? కామెంట్ చేయండి.

News April 17, 2026

మోదీని ‘జాదూగర్’ అన్న రాహుల్.. క్షమాపణకు బీజేపీ డిమాండ్

image

మహిళా రిజర్వేషన్లపై చర్చ సందర్భంగా PM మోదీని జాదూగర్(మెజీషియన్) అంటూ రాహుల్ గాంధీ చేసిన కామెంట్లతో లోక్‌సభలో గందరగోళం నెలకొంది. ఆయన ప్రధానిని అవమానిస్తున్నారంటూ BJP సభ్యులు మండిపడ్డారు. రాహుల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 140Cr ప్రజలకు ప్రతినిధి అయిన మోదీని ఎగతాళి చేయడం సరికాదని రాజ్‌నాథ్ విమర్శించారు. ఈ క్రమంలో LoP వ్యాఖ్యలను స్పీకర్ ఓం బిర్లా రికార్డుల నుంచి తొలగించారు.