News January 20, 2025
ఇక నుంచి నా గౌరవం పెంచే సినిమాలే తీస్తా: RGV

ఇకపై తాను ‘సత్య’లాంటి సినిమాలను తెరకెక్కించాలని అనుకుంటున్నట్లు డైరెక్టర్ RGV తెలిపారు. ఇటీవల ‘సత్య’ మూవీని చూసినప్పుడు కన్నీళ్లు వచ్చాయని, ఆ సినిమాను బెంచ్ మార్క్‌గా పెట్టుకుని తాను మరింత సిన్సియర్‌గా మూవీస్ తీసి ఉండాల్సిందని అన్నారు. ‘నేను పొందిన విజయాల మత్తులో, అహంకారంతో ఏవేవో సినిమాలు తీసేశాను. సత్య నా కళ్లు తెరిపించింది. ఇక నుంచి నా గౌరవం పెంచే సినిమాలనే తీస్తా’ అని ట్వీట్ చేశారు.
Similar News
News December 9, 2025
రాంబిల్లి: ఆరుగురు విద్యార్థులు అదృశ్యం

రాంబిల్లి మండలం వెంకటాపురంలో భాగవతుల ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న రెసిడెన్షియల్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థులు మధ్యాహ్నం అదృశ్యమయ్యారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా వీరి ఆచూకీ లభించలేదు. దీంతో ట్రస్ట్ యాజమాన్యం రాంబిల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీరి ఆచూకీ కోసం రాంబిల్లి పోలీసులు గాలిస్తున్నారు. విద్యార్థులు స్కూలు నుంచి ఎందుకు వెళ్లిపోయారో తెలియాల్సి ఉంది.
News December 9, 2025
విజృంభిస్తున్న భారత బౌలర్లు

సౌతాఫ్రికాతో తొలి టీ20లో భారత బౌలర్లు చెలరేగుతున్నారు. సఫారీ జట్టు టాపార్డర్‌ను కుప్పకూల్చారు. అర్ష్‌దీప్ తొలి ఓవర్లోనే ఓపెనర్ డికాక్‌ను డకౌట్ చేశారు. తర్వాత స్టబ్స్(14)ను వెనక్కి పంపారు. మార్క్రమ్(14)ను అక్షర్ బౌల్డ్ చేయగా, డేవిడ్ మిల్లర్(1)ను పాండ్య పెవిలియన్‌కు పంపారు. ఫెరీరా(5)ను వరుణ్ ఔట్ చేశారు. దీంతో SA 50 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.