News June 11, 2024

సర్పంచ్ నుంచి సీఎం దాకా..

image

ఒడిశా తొలి BJP CMగా ఎన్నికైన మోహన్ చరణ్ మాఝీ తన రాజకీయ ప్రస్థానాన్ని సర్పంచ్ స్థాయి నుంచి ప్రారంభించారు. వాచ్‌మెన్ కొడుకైన మోహన్ 1997-2000 మధ్య కాలంలో ఆదివాసీ ప్రాంతమైనా రాయికల గ్రామ సర్పంచ్‌గా చేశారు. ఆ తర్వాత 2000లో కియోంజర్ నియోజకవర్గ MLAగా గెలిచారు. 2004, 19, 24లోనూ అదే స్థానం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఒడిశాలో గిరిధర్ గమాంగ్, హేమానంద బిస్వాల్ తర్వాత మూడో ఆదివాసీ సీఎంగా నిలవనున్నారు.

Similar News

News December 23, 2024

రేపు, ఎల్లుండి భారీ వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడినప్పటికీ అనూహ్యంగా దిశ మార్చుకుంది. తీవ్ర అల్పపీడనంగా మారి దక్షిణ కోస్తా తీరం దిశగా పయనిస్తోంది. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి ఉత్తరాంధ్ర, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, ఉ.గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయంది.

News December 23, 2024

పీవీ సింధు పెళ్లి జరిగింది ఇక్కడే

image

రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని ఉదయ్‌సాగర్‌ సరస్సులో 21 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఒక దీవిలో పీవీ సింధు-వెంకట దత్తసాయి వివాహం జరిగింది. ఆరావళి పర్వతాల మధ్యలోని ఈ దీవిలో వంద గదులతో రఫల్స్‌ సంస్థ ఈ భారీ రిసార్ట్‌ను నిర్మించింది. అతిథులను పడవల్లో వివాహ వేదిక వద్దకు తీసుకెళ్లారు. వారికోసం 100 గదులను సింధు ఫ్యామిలీ బుక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ రిసార్ట్‌లో ఓ గదికి ఒక రోజు అద్దె రూ.లక్ష ఉంటుందని సమాచారం.

News December 23, 2024

రైతు భరోసాపై ప్రభుత్వాన్ని నిలదీయండి: KTR

image

రైతు భరోసాపై ప్రభుత్వాన్ని నిలదీయాలంటూ రైతులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ‘ప్రతి ఎకరానికి ఏడాదికి రూ.15వేలు ఇస్తామని సీఎం రేవంత్ అన్నారు. ఇప్పటికే రెండు పంట సీజన్లు అయిపోయాయి. మూడో సీజన్ కూడా వచ్చేసింది. ఒక్కో రైతుకు ఒక్కో ఎకరానికి రూ.17,500 ప్రభుత్వం బాకీ పడింది. ఆంక్షలు విధించి లక్షలాది మందికి రైతు భరోసా ఎగ్గొట్టాలని చూస్తున్నారు’ అని పేర్కొన్నారు.