News December 23, 2024

పీవీ సింధు పెళ్లి జరిగింది ఇక్కడే

image

రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని ఉదయ్‌సాగర్‌ సరస్సులో 21 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఒక దీవిలో పీవీ సింధు-వెంకట దత్తసాయి వివాహం జరిగింది. ఆరావళి పర్వతాల మధ్యలోని ఈ దీవిలో వంద గదులతో రఫల్స్‌ సంస్థ ఈ భారీ రిసార్ట్‌ను నిర్మించింది. అతిథులను పడవల్లో వివాహ వేదిక వద్దకు తీసుకెళ్లారు. వారికోసం 100 గదులను సింధు ఫ్యామిలీ బుక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ రిసార్ట్‌లో ఓ గదికి ఒక రోజు అద్దె రూ.లక్ష ఉంటుందని సమాచారం.

Similar News

News January 22, 2025

పీవీ సింధు పరాజయం

image

ఇండోనేషియా మాస్టర్స్ 2025 టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తొలి రౌండ్‌లోనే వెనుదిరిగారు. వుమెన్స్ సింగిల్స్‌లో వియత్నాం క్రీడాకారిణి గుయెన్ టీఎల్ చేతిలో 20-22, 12-21 తేడాతో చిత్తుగా ఓడిపోయారు. తొలి నుంచి ప్రత్యర్థిపై సింధు ఆధిపత్యం ప్రదర్శించలేకపోయారు. అంతకుముందు ఇండియా ఓపెన్‌లోనూ సింధు ఓడిపోయారు.

News January 22, 2025

శారదా పీఠం భవనం కూల్చేందుకు ఆదేశాలిస్తాం: హైకోర్టు

image

AP: తిరుమలలోని శారదా పీఠం భవన నిర్మాణంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణాలు ఎలా చేపడతారని ప్రశ్నించింది. భవనం కూల్చివేతకు ఆదేశాలిస్తామని తెలిపింది. అనుమతి లేకుండా నిర్మిస్తే ఏం జరుగుతుందో ఈ కేసు ఓ ఉదాహరణ కావాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కౌంటర్ దాఖలు చేయాలని శారదా పీఠాన్ని ఆదేశించింది.

News January 22, 2025

రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. MSP పెంపు

image

జనపనార (జూట్) రైతులకు మోదీ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. 2025-26 సీజన్‌కు గాను కనీస మద్దతు ధర (MSP)ను 6% అంటే క్వింటాకు రూ.315 మేర పెంచి రూ.5,650కి చేర్చింది. దీంతో దేశవ్యాప్తంగా జూట్ ఉత్పత్తిపై సగటు ఖర్చు కన్నా రైతుకు 66% ఎక్కువ రాబడి లభిస్తుంది. 2014-15లో రూ.2400గా ఉన్న క్వింటా ధరను కేంద్రం పదేళ్లలో 235 శాతానికి పెంచడం గమనార్హం. దేశవ్యాప్తంగా 40 లక్షల రైతు కుటుంబాలు జనపనార సాగు చేస్తున్నాయి.