News February 5, 2025
విదేశాలకు 47% పెరిగిన పళ్లు, కూరగాయల ఎగుమతులు

APEDA ఆర్థిక సహకారంతో గత ఐదేళ్లలో భారత్ నుంచి పళ్లు, కూరగాయాల ఎగుమతులు 47.3% పెరిగాయని కామర్స్ మినిస్ట్రీ తెలిపింది. విలువ పరంగా ఈ వృద్ధిరేటు 41.5% అని పేర్కొంది. FY 2023-24లో 123 దేశాలకు ఎగుమతులు చేరాయని వెల్లడించింది. రైతుల కోసం Intl ట్రేడ్ ఫెయిర్స్లో పాల్గొనడం, బయ్యర్ సెల్లర్ మీటింగ్స్ ఏర్పాటు, మార్కెట్ యాక్సెస్‌తో ఇది సాధ్యమైందని వివరించింది. గత మూడేళ్లలో 17 కొత్త మార్కెట్లలో ప్రవేశించామంది.
Similar News
News November 23, 2025
డిసెంబర్ 6న వైజాగ్‌కు రోహిత్, కోహ్లీ

IND, SA మధ్య ఈనెల 30 నుంచి 3 మ్యాచుల వన్డే సిరీస్ జరగనుంది. చివరి వన్డేను విశాఖలోని ACA-VDCA స్టేడియంలో ఆడనున్నారు. ఈ నేపథ్యంలో చాలా రోజుల తర్వాత స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆటను ప్రత్యక్షంగా చూసే అవకాశం AP క్రికెట్ ఫ్యాన్స్‌కు దక్కనుంది. ఈ మ్యాచు టికెట్లు NOV 28 నుంచి విక్రయించనున్నారు. డిస్ట్రిక్ట్ యాప్‌లో 22,000 టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. వీటి ధర ₹1200-18,000 మధ్య ఉంటుంది.
News November 23, 2025
స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదా?

స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదని పండితులు సూచిస్తున్నారు. ‘సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు స్త్రీల ఉదర భాగం నేలకు తాకుతుంది. ఆ ప్రదేశంలో గర్భకోశం ఉంటుంది. కాబట్టి గర్భకోశానికి హాని కలిగే ప్రమాదం ఉంటుంది. అందుకే స్త్రీలు అలా చేయకూడదు. బదులుగా మోకాళ్లపై కూర్చొని, తలను వంచి సాదర నమస్కారం చేయవచ్చు. అలాగే నడుము వంచి కూడా ప్రార్థించవచ్చు. సాష్టాంగ నమస్కారం పురుషులకు మాత్రమే’ అని చెబుతున్నారు.
News November 23, 2025
రూ.10కి లభించే బెస్ట్ థింగ్ ఏంటి?

భారత్‌లో రూ.10కి లభించే బెస్ట్ థింగ్ ఏంటి? అనే సోషల్ మీడియా పోస్టుకు నెటిజన్లు ఆసక్తికర సమాధానాలిస్తున్నారు. టీ, బాయిల్డ్ ఎగ్, చిన్న సమోసా, సిగరెట్, లోకల్ ట్రైన్ టికెట్, చిప్స్, వాటర్ బాటిల్, బిస్కెట్స్, చాక్లెట్స్, పెన్, పెన్సిల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీ దృష్టిలో రూ.10కి కొనగలిగే బెస్ట్ ఐటమ్ ఏంటో కామెంట్ చేయండి.


