News February 5, 2025
విదేశాలకు 47% పెరిగిన పళ్లు, కూరగాయల ఎగుమతులు

APEDA ఆర్థిక సహకారంతో గత ఐదేళ్లలో భారత్ నుంచి పళ్లు, కూరగాయాల ఎగుమతులు 47.3% పెరిగాయని కామర్స్ మినిస్ట్రీ తెలిపింది. విలువ పరంగా ఈ వృద్ధిరేటు 41.5% అని పేర్కొంది. FY 2023-24లో 123 దేశాలకు ఎగుమతులు చేరాయని వెల్లడించింది. రైతుల కోసం Intl ట్రేడ్ ఫెయిర్స్‌లో పాల్గొనడం, బయ్యర్ సెల్లర్ మీటింగ్స్ ఏర్పాటు, మార్కెట్ యాక్సెస్‌తో ఇది సాధ్యమైందని వివరించింది. గత మూడేళ్లలో 17 కొత్త మార్కెట్లలో ప్రవేశించామంది.
Similar News
News February 9, 2025
నక్సలిజాన్ని పూర్తిగా పెకిలిస్తాం: అమిత్ షా

వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా పెకిలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశాన్ని నక్సల్స్ రహితంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని ట్వీట్ చేశారు. ‘ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోలు మరణించారు. ఈ పోరులో ఇద్దరు జవాన్లను కోల్పోయాం. వీరికి దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుంది. ఇకపై దేశంలో ఏ పౌరుడూ నక్సలిజం కారణంగా ప్రాణాలు కోల్పోకూడదు’ అని ఆయన పేర్కొన్నారు.
News February 9, 2025
మణిపుర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా

మణిపుర్ సీఎం బీరెన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. కొంతకాలంగా మణిపుర్‌లో జరుగుతున్న అల్లర్లకు బాధ్యత వహిస్తూ పదవిని వీడారు. అమిత్ షాను కలిసిన అనంతరం బీరెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తన రాజీనామా లేఖను గవర్నర్ అజయ్ భళ్లాకు పంపారు. కాగా బీరెన్ సింగ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు నిన్న కాంగ్రెస్ ప్రకటించింది. ఈలోపే ఆయన రాజీనామా చేయడం గమనార్హం.
News February 9, 2025
ఆగిన ఫ్లడ్ లైట్లు.. మ్యాచ్ నిలిపివేత

భారత్-ఇంగ్లండ్ రెండో వన్డేకు అంతరాయం కలిగింది. రోహిత్ శర్మ జోరు మీదున్న టైంలో స్టేడియంలో ఫ్లడ్ లైట్లు ఆగిపోయాయి. వెలుతురు లేక అంపైర్లు మ్యాచును నిలిపివేశారు. ఇరు జట్ల ప్లేయర్లు మైదానాన్ని వీడారు. దీంతో ప్రేక్షకులు సెల్ ఫోన్ ఫ్లాష్ లైట్లను ఆన్ చేసి సందడి చేస్తున్నారు.