News September 24, 2024

తిరుమలలో రూ.22 కోట్లతో FSSAI ల్యాబ్

image

తిరుమలలో ₹22 కోట్లతో ల్యాబ్ ఏర్పాటుకు FSSAI సిద్ధమైంది. ఇందుకోసం 12000 చదరపు అడుగుల స్థలాన్ని TTD కేటాయించింది. లడ్డూ, అన్నదానం, ఇతర అవసరాల కోసం రూ.800 కోట్లకు పైగా విలువైన పదార్థాలను TTD ఏటా కొనుగోలు చేస్తోంది. వీటి నాణ్యత పరిశీలనకు FSSAI ల్యాబ్ ఏర్పాటు చేయాలని TTD ఇటీవల కోరింది. ఇందులో ₹5 కోట్లతో మైక్రోబయాలజీ వ్యవస్థ, ₹9 కోట్లతో అత్యాధునిక యంత్రాలు, ₹6 కోట్లతో బేసిక్ పరికరాలను కొనుగోలు చేస్తారు.

Similar News

News October 15, 2024

TODAY HEADLINES

image

☞APలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్: CM చంద్రబాబు
☞ అక్రమార్జన కోసమే కొత్త లిక్కర్ పాలసీ: జగన్
☞ వర్షాలు.. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో రేపు స్కూళ్లకు సెలవు
☞ TG: ఈనెల 24 నుంచి కులగణనపై అభిప్రాయాల సేకరణ
☞ సికింద్రాబాద్ ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం.. రాష్ట్రంలో కలకలం
☞ జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ కొట్టివేత
☞ టీ20 WC నుంచి భారత మహిళల జట్టు నిష్క్రమణ

News October 15, 2024

BRS అనుమతిచ్చిన దాన్నే KTR వ్యతిరేకిస్తున్నారు: CMO

image

TG: తమ పదేళ్ల పాలనలో దామగుండం ఫారెస్ట్‌లో రాడార్ స్టేషన్ నిర్మాణానికి తాము ఒప్పుకోలేదన్న KTR వ్యాఖ్యలపై CMO స్పందించింది. గత ప్రభుత్వమే నేవల్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిందని పేర్కొంది. BRS తుది ఆమోదం తెలిపిన ప్రాజెక్టుపై ఇప్పుడు KTR రాజకీయం చేస్తున్నారని వివరించింది.

News October 15, 2024

ఆలయంపై దాడితో కలవరపడ్డా: KTR

image

TG: సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంపై దాడి తనను కలవరపాటుకు గురిచేసిందని KTR చెప్పారు. ఇలాంటి చర్యలు హైదరాబాద్ సహనశీలతకు మచ్చ అని ఆయన స్పష్టం చేశారు. ఆలయంపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారుతున్నాయని విమర్శించారు.