News April 10, 2024

నీరు, కార్బన్‌డైఆక్సైడ్‌తో ఇంధనం!

image

పర్యావరణ హితమని EVల హవా కొనసాగుతున్న వేళ USలో ఇన్ఫీనియమ్ సంస్థ విప్లవాత్మక ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. నీరు, కార్బన్‌డైఆక్సైడ్‌ (CO2)తో ఇంధనాన్ని తయారు చేస్తోంది. ఎలక్ట్రోలైజర్స్‌తో నీటి నుంచి హైడ్రోజన్‌‌ను వేరు చేస్తారు. రియాక్టర్‌లో హైడ్రోజన్‌‌, CO2 మధ్య రియాక్షన్ జరిగి ఇంధనం తయారవుతుంది. రోజుకు 8,300 లీటర్ల ఇంధనం ఉత్పత్తి అవుతోందట. 2030కి ఈ ఇంధన మార్కెట్ $50బిలియన్లకు చేరొచ్చని అంచనా.

Similar News

News October 10, 2024

నన్ను చంపాలనుకున్నారనే ప్రచారం జరిగింది: సీఎం

image

AP: YCP హయాంలో అందరికంటే ఎక్కువ వేధింపులకు గురైంది తానేనని CM చంద్రబాబు అన్నారు. ‘నేను జైలులో ఉన్నప్పుడు నన్ను చంపేందుకు కుట్ర పన్నారనే ప్రచారం జరిగింది. జైలుపై డ్రోన్లు ఎగురవేశారు. CC కెమెరాలు పెట్టారు. దోమ తెర కూడా ఇవ్వలేదు. కక్ష తీర్చుకోవడం నా లక్ష్యం కాదు. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారం ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. మరీ మితిమీరితే ఏం చేయాలో నాకు తెలుసు’ అని వ్యాఖ్యానించారు.

News October 10, 2024

ఆయూష్ యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

image

AP: బీఏఎంఎస్, BHMS, BUMS కోర్సుల్లో ప్రవేశాలకు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. నీట్ యూజీ-2024లో అర్హత పొందిన విద్యార్థులు ఈ నెల 14వ తేదీలోపు వర్సిటీ వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవాలంది. ఇటు MBBS మేనేజ్‌మెంట్ కోటాలో చేరిన విద్యార్థులు ఈ నెల 14తేదీ లోపు ఫ్రీఎగ్జిట్ అవ్వొచ్చని తెలిపింది. దివ్యాంగ కోటాలో కన్వీనర్ సీట్లు పొందిన వారు ఈ నెల 11లోపు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలంది.

News October 10, 2024

పల్లె పండుగ పనులపై మార్గదర్శకాలు జారీ

image

AP: పల్లె పండుగ పేరిట పంచాయతీల్లో ఈ నెల 14- 20వ తేదీ వరకు అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ పనులను JAN నెలాఖరులోగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఉపాధి హామీ పథకం నిబంధనలకు అనుగుణంగా పనులు నిర్వహించాలంది. జియో ట్యాగింగ్ సహా అన్ని వివరాలను పీఆర్ వన్ యాప్‌లో నమోదు చేయాలని అధికారులకు సూచించింది. సోషల్ ఆడిట్ అనంతరం బిల్లులు చెల్లిస్తామంది.