News April 10, 2024
నీరు, కార్బన్‌డైఆక్సైడ్‌తో ఇంధనం!

పర్యావరణ హితమని EVల హవా కొనసాగుతున్న వేళ USలో ఇన్ఫీనియమ్ సంస్థ విప్లవాత్మక ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. నీరు, కార్బన్‌డైఆక్సైడ్ (CO2)తో ఇంధనాన్ని తయారు చేస్తోంది. ఎలక్ట్రోలైజర్స్‌తో నీటి నుంచి హైడ్రోజన్‌ను వేరు చేస్తారు. రియాక్టర్‌లో హైడ్రోజన్, CO2 మధ్య రియాక్షన్ జరిగి ఇంధనం తయారవుతుంది. రోజుకు 8,300 లీటర్ల ఇంధనం ఉత్పత్తి అవుతోందట. 2030కి ఈ ఇంధన మార్కెట్ $50బిలియన్లకు చేరొచ్చని అంచనా.
Similar News
News March 17, 2025
నియోజకవర్గానికి 4-5వేల మందికి సాయం: సీఎం రేవంత్

TG: ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని SC, ST, BC, మైనార్టీ నిరుద్యోగులకు అర్హత ప్రకారం అమలు చేస్తామని CM రేవంత్ తెలిపారు. ఒక్కొక్కరికి ₹50వేల నుంచి ₹4లక్షల వరకు మంజూరు చేస్తామన్నారు. ‘రాబోయే 2 నెలల్లో డబ్బులు మీ చేతుల్లో పెడతాం. జూన్ 2న 5లక్షల మంది లబ్ధిదారులను ప్రకటిస్తాం. నియోజకవర్గానికి 4-5వేల మందిని ఎంపిక చేస్తాం’ అని పేర్కొన్నారు.
News March 17, 2025
‘ఫ్యామిలీ రూల్’పై అనుష్క శర్మ పోస్ట్.. వైరల్

బీసీసీఐ ప్రవేశపెట్టిన ‘ఫ్యామిలీ రూల్’పై టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ పరోక్షంగా స్పందించారు. ‘నువ్వు తెలిసిన ప్రతి ఒక్కరి మనసులో నీ గురించి వేర్వేరు అభిప్రాయాలు ఉంటాయి. కానీ నువ్వేంటో నీకు మాత్రమే తెలుసు’ అంటూ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కాగా టూర్లలో క్రికెటర్లతోపాటు వారి కుటుంబాలు, సన్నిహితులు ఉంటే బాగుంటుందని విరాట్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
News March 17, 2025
అత్యధిక పన్ను చెల్లించే నటుడు ఎవరంటే?

బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇన్కమ్‌ట్యాక్స్ చెల్లించడంలో ఎప్పుడూ ముందుంటారు. తాజాగా ఆయన అడ్వాన్స్ ట్యాక్స్ రూ.52.50కోట్లు చెల్లించినట్లు సినీవర్గాలు తెలిపాయి. కాగా, 2024-2025 ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ.350 కోట్లు సంపాదించినట్లు పేర్కొన్నాయి. తద్వారా రూ.120 కోట్లు పన్ను చెల్లించి అత్యధికంగా పన్ను చెల్లించిన నటుడిగా నిలిచినట్లు వెల్లడించాయి. 85 సంవత్సరాల వయసులోనూ ఆయన ఎంతో డిమాండ్ ఉన్న నటుడిగా ఉన్నారు.