News July 19, 2024
కంప్యూటర్ సైన్స్ కోర్సులకు ఫుల్ డిమాండ్
తెలుగు రాష్ట్రాల్లో కంప్యూటర్ సైన్స్, ఐటీ కోర్సులకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. 90% మంది స్టూడెంట్స్ CSE, ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్, IOT విభాగాలను సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఈ రంగాల్లో ఉపాధి, ఆదాయం ఎక్కువగా ఉండటంతో యువత అటువైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈఈఈ, మెకానికల్, సివిల్ సీట్లకు డిమాండ్ తగ్గుతోంది. మరి మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నారో కామెంట్ చేయండి.
Similar News
News October 11, 2024
‘మా నాన్న సూపర్ హీరో’ మూవీ REVIEW
ఇది కన్నతండ్రి(సాయిచంద్), పెంచిన తండ్రి(సాయాజీ షిండే), ఓ కొడుకు(సుధీర్‌బాబు) మధ్య ముక్కోణపు ఎమోషనల్ కథ. డైరెక్టర్ అభిలాష్ కొత్త తరహా కథాంశాన్ని ఎమోషనల్ డ్రామాగా తీర్చిదిద్దారు. పెంచిన తండ్రి అప్పు తీర్చేందుకు హీరో కష్టాలు, కొడుకు ప్రేమకై తపించే కన్నతండ్రి యాంగిల్ ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ సన్నివేశాలు బాగున్నా పాత్రల మధ్య కొరవడిన భావోద్వేగాలు, స్లో నరేషన్, చివరి 20 నిమిషాలు మైనస్.
రేటింగ్: 2.5/5
News October 11, 2024
16 నుంచి ఇంటర్ కాలేజీల టైమింగ్స్ మార్పు
AP: ప్రభుత్వ జూనియర్, ఎయిడెడ్ కాలేజీల సమయాల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. ప్రస్తుతం ఉ.9 నుంచి సా.4 వరకు టైమింగ్స్ ఉండగా, ఈ నెల 16 నుంచి సా.5 వరకు సమయాన్ని పొడిగించింది. గత ఏడాది ఫలితాల్లో ఆశించిన స్థాయిలో విద్యార్థులు రాణించకపోవడంతో సా.4-5 గంటల మధ్య స్టడీ అవర్ నిర్వహించాలని ఇంటర్ బోర్డు డైరెక్టర్ కృతిక శుక్ల ఉత్తర్వులిచ్చారు. ఈ మేరకు టైమ్ టేబుల్ సిద్ధం చేసుకోవాలని ప్రిన్సిపల్స్‌ను ఆదేశించారు.
News October 11, 2024
OTTలోకి వచ్చేసిన సూపర్ హిట్ మూవీ
శ్రీసింహా, సత్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మత్తు వదలరా-2’ చిత్రం ఓటీటీలోకి వచ్చింది. అర్ధరాత్రి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. రితీశ్ రాణా దర్శకత్వం వహించిన ఈ మూవీ గత నెల 13న విడుదలైన సూపర్ హిట్‌గా నిలిచింది. కాలభైరవ సంగీతం అందించగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించారు. వెన్నెల కిశోర్, సునీల్, రోహిణి, ఝాన్సీ కీలక పాత్రలు పోషించారు.