News November 17, 2024
చనిపోయాడనుకొని అంత్యక్రియలు.. తీరా చూస్తే.!
గుజరాత్‌కు చెందిన బ్రిజేశ్ OCT 27న అదృశ్యమవడంతో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. NOV 10న వారు సబర్మతి బ్రిడ్జి కింద కుళ్లిపోయిన మృతదేహాన్ని గుర్తించి కుటుంబీకులకు సమాచారమిచ్చారు. వారు డెడ్‌బాడీ బ్రిజేశ్‌దేనని కన్ఫర్మ్ చేసి అంత్యక్రియలు చేశారు. శుక్రవారం ఇంటివద్ద ప్రేయర్ మీట్ నిర్వహించగా దానికి బ్రిజేశ్ రావడంతో అంతా షాక్ అయ్యారు. డెడ్‌బాడీని నిర్ధారించడంలో కుటుంబీకులు పొరబడ్డట్లు తేలింది.
Similar News
News December 4, 2024
వారికి రుణమాఫీ చేసే బాధ్యత నాదే: మంత్రి పొన్నం
TG: రూ.2 లక్షల లోపు రుణం ఉన్న వారికి మాఫీ చేసే బాధ్యత తనదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎవరికైనా ఇప్పటికీ మాఫీ కాకపోతే తన ఆఫీసుకు రావాలన్నారు. రూ.2 లక్షలపైనే రుణాలు ఉన్న వారికి త్వరలోనే మాఫీ చేస్తామని చెప్పారు. ఆపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశామని తెలిపారు. మిగిలిన హామీలను వరుస క్రమంలో నెరవేరుస్తామని పేర్కొన్నారు.
News December 4, 2024
కేబినెట్‌లో ఏక్‌నాథ్ శిండే కీలకపాత్ర పోషిస్తారు: ఫడణవీస్
ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని మహారాష్ట్రలో మహాయుతి కూటమి నేతలు గవర్నర్‌ను కోరారు. అనంతరం సీఎం అభ్యర్థి దేవేంద్ర ఫడణవీస్ మీడియాతో మాట్లాడారు. ‘రేపు సాయంత్రం 5.30 గంటలకు జరిగే ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ హాజరవుతారు. డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ఉంటారు. కేబినెట్‌లో ఏక్‌నాథ్ శిండే కీలకపాత్ర పోషిస్తారు’ అని తెలిపారు. కాగా ప్రమాణ స్వీకారానికి ఏపీ సీఎం చంద్రబాబు కూడా హాజరుకానున్నారు.
News December 4, 2024
ఉచిత విద్యుత్ నిలిపివేయం: మంత్రి గొట్టిపాటి
AP: ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ నిలిపివేస్తున్నారనే ప్రచారాన్ని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఖండించారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రతి నెలా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15,17,298 ఎస్సీ కుటుంబాలకు, 4,75,557 ఎస్టీ కుటుంబాలకు ఉచిత విద్యుత్ ద్వారా లబ్ధి చేకూరుస్తున్నట్లు ట్వీట్ చేశారు. కూటమి ప్రభుత్వంపై బురద చల్లే దుష్ప్రచారాన్ని నమ్మవద్దన్నారు.