News May 3, 2024
ఎండల ఉగ్రరూపం.. వడదెబ్బతో నలుగురు మృతి

TG: రాష్ట్రంలో ఎండలు ఉగ్రరూపం దాల్చాయి. నిన్న ఏకంగా 8 జిల్లాల్లో 46 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండ జిల్లా ఇబ్రహీంపేటలో అత్యధికంగా 46.6 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. ఎండ వేడికి తాళలేక నిన్న ఒక్కరోజే నలుగురు మృత్యువాత పడ్డారు. మెదక్ జిల్లాలో కుమ్మరి శాకయ్య, ఆసిఫాబాద్లో పోర్తెటి శ్రీనివాస్, కరీంనగర్లో గజ్జెల సంజీవ్, హనుమకొండలో అల్లె గోవర్ధన్ వడదెబ్బకు గురై ప్రాణాలు విడిచారు.
Similar News
News October 14, 2025
ఇంటర్ పరీక్షలు ఎప్పుడంటే?

TG: ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి చివరివారంలో మొదలయ్యే అవకాశముంది. 2026 FEB 25 నుంచి పరీక్షలు నిర్వహించేలా టైం టేబుల్ ఫైల్ను ఇంటర్ బోర్డు CMకు పంపినట్లు తెలుస్తోంది. దీనికి రేవంత్ సైతం ఆమోదం తెలిపినట్లు అధికార వర్గాలు Way2Newsకు వెల్లడించాయి. ఎంట్రన్స్ పరీక్షలు(JEE మెయిన్, ఎప్సెట్) ఉండటంతో షెడ్యూల్ ముందుకు జరిపినట్లు సమాచారం. అటు ఏపీలో FEB 23 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
News October 14, 2025
వైట్ డిశ్చార్జ్ గురించి తెలుసుకోండి

మహిళల్లో కనిపించే అత్యంత సాధారణ లక్షణం వైట్ డిశ్చార్జ్. అయితే ఇది కొన్నిసార్లు ప్రమాదకరంగా మారుతుందంటున్నారు నిపుణులు. దుర్వాసన, రంగుమారడం, మంట అసౌకర్యం వంటి లక్షణాలకు ఇన్ఫెక్షన్లు, లైంగిక వ్యాధులు కారణం కావొచ్చంటున్నారు. నిర్లక్ష్యం చేస్తే ఫెలోపియన్ ట్యూబ్స్ మూసుకుపోయి గర్భధారణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఇబ్బంది ఎదురైతే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. <<-se>>#Womenhealth<<>>
News October 14, 2025
బనకచర్లను ఆపండి… CWCకి తెలంగాణ లేఖ

ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టును ఆపాలని తెలంగాణ ప్రభుత్వం CWC, పోలవరం అథారిటీకి లేఖ రాసింది. ఈ లేఖలో పలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. టెండర్లు, సర్వేను తక్షణమే ఆపాలని కోరింది. ఆ ప్రాజెక్టును ఆమోదించవద్దని, పోలవరం DPRకు విరుద్ధంగా ఉందని లేఖలో వెల్లడించింది.